Begin typing your search above and press return to search.
బ్రాండ్ అంబాసిడర్ గా సోనూ సూద్.. ప్రభుత్వ ఉత్తర్వులు!
By: Tupaki Desk | 12 April 2021 11:00 AM ISTమొదటి దశలో కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టుముట్టిన వేళ.. ఎంతో మంది అభాగ్యులకు చేయి అందించాడు సోనూ సూద్. అప్పటి నుంచి మొదలైన అతడి సహాయం.. చేతికి ఎముక లేదన్న చందంగా సాగిపోతూనే ఉంది. ఆపదలో ఉన్నానమని ఎవరు సాయం కోరినా.. కాదనకుండా, లేదనకుండా అందిస్తూ పోతున్నాడీ రియల్ హీరో!
ఇప్పుడు దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈసారి కూడా తన వంతుగా సహకారం అందిస్తూనే ఉన్నాడు సోనూ. ఇటీవల పంజాబ్ లోని అమృత్ సర్ లో ‘సంజీవని’ పేరుతో సాగించిన కొవిడ్ వ్యాక్సినేషన్ లో మొదటి టీకా తీసుకున్నాడు. ప్రజలంతా టీకా తీసుకోవాలని, భయపడాల్సిన పనిలేదని పిలుపునిచ్చాడు.
ఈ క్రమంలోనే.. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సోనూను కొవిడ్ వ్యాక్సినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. కొవిడ్ తో పోరాటంలో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే.. వివిధ కారణాలతో ప్రజలు సందేహిస్తున్న వేళ.. వ్యాక్సిన్ ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి సోనూ లాంటి వాళ్లు కావాలని అన్నారు.
దీనిపై సోనూ సూద్ స్పందించారు. ఈ బాధ్యతను గొప్ప గౌరవంగా భావిస్తానని అన్నారు. ప్రజలంతా కొవిడ్ టీకా తీసుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.