Begin typing your search above and press return to search.

కేన్స్ లో ఛాన్స్ కొట్టేసిందిగా

By:  Tupaki Desk   |   13 Jun 2016 4:29 AM GMT
కేన్స్ లో ఛాన్స్ కొట్టేసిందిగా
X
కెరీర్ బెస్ట్ అనే మాటని ఏ స్టేజ్ లో చెప్పాలో, ఒప్పుకోవాలో చాలామందికి అర్ధం కాదు. హీరోయిన్ అవికాగోర్ పరిస్థితి ఇలాగే ఉంటుంది. బాలికావధు సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించేసింది ఈ చిన్నారి పెళ్లికూతురు. హీరోయిన్ గా అరంగేట్రం చేసిన తర్వాత.. వరుస సక్సెస్ లతో దూసుకుపోయింది. అయితే.. తన పర్సనాలిటీ కారణంగా పెద్ద హీరోల పక్కన ఛాన్సులు రావడం లేదనే విషయాన్ని గ్రహించి - స్లిమ్ అయిపోయేందుకు ప్రయత్నించి సక్సెస్ అయిపోయింది.

మరోవైపు తన ట్యాలెంట్ ని చూపించేందుకు ఓ షార్ట్ ఫిలిం కూడా చేసేసింది. దీని పేరు 'ఆల్మోస్ట్'. రీసెంట్ గా ముగిసిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అవిక బాగానే సందడి చేసింది. అంతే కాదు.. ఆ ఈవెంట్ లోనే ఆల్మోస్ట్ కి ఫస్ట్ లుక్ పోస్టర్ ను, ట్రైలర్ ను కూడా లాంఛ్ చేసింది. ఈ షార్ట్ ఫిలింని తీసిన ఫ్రెంచ్ ప్రొడ్యూసర్ సోనియా ఛాంగ్ కు.. అవిక అందంతో పాటు ట్యాలెంట్ విపరీతంగా నచ్చేసిందట. అందుకే కేన్స్ లో ఉండగానే.. ఓ బంపర్ ఆఫర్ ఇచ్చేశాడట ఈ ప్రొడ్యూసర్.

త్వరలో ఓ భారీ బాలీవుడ్ మూవీ చేయబోతున్నట్లు చెప్పిన ఛాంగ్.. అందులో అవికాగోర్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు చెప్పాడు. అంతే కాదు, ఆల్మోస్ట్ లో అవికకు జంటగా నటించిన మనీష్ రైజింఘాని ని హీరోగా అనౌన్స్ చేశాడు. అటు ఫిలిం ఫెస్టివల్ లో ఫేమ్ తో పాటు.. ఇటు బాలీవుడ్ మూవీ ఆఫర్ కూడా రావడంతో.. తన కెరీర్ లో ఇప్పటికి ఇదే బెస్ట్ అంటోంది అవికా గోర్.