Begin typing your search above and press return to search.

బృందావనం కాలనీ 'డిటెక్టివ్‌ సత్యభామ'

By:  Tupaki Desk   |   31 Dec 2021 3:30 AM GMT
బృందావనం కాలనీ డిటెక్టివ్‌ సత్యభామ
X
తెలుగు ప్రేక్షకులకు 7/జి బృందావనం కాలనీ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ సోనియా అగర్వాల్‌. ఆ సినిమాలో ఆమె నటన కు అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. తెలుగు మరియు తమిళంలో కంటిన్యూస్ గా ఈమె సినిమాల్లో నటిస్తూనే ఉంది.

దాదాపుగా సోనియా అగర్వాల్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు కాబోతుంది. అయినా కూడా ఆమె ప్రథాన పాత్రల్లో సినిమాలను చేస్తూనే ఉంది. తాజాగా ఈమె డిటెక్టివ్‌ సత్యభామ సినిమాను చేసింది. ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది.

సోనియా అగర్వాల్‌ ప్రథాన పాత్రలో డిటెక్టివ్ సత్యభామ ను నవనీత్ చారి తెరకెక్కించాడు. శ్రీశైలం పోలెమోని ఈ సినిమాను నిర్మించాడు. సునీత పాండే ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇంకా తెలుగు నటీ నటులు పలువురు ఈ సినిమాలో నటించారు. సినిమా ను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత తెలియజేశాడు. 500 థియేటర్లలో ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత శ్రీశైలం పోలెమోని పేర్కొన్నారు. ఒక పవర్‌ ఫుల్‌ లేడీ కథ తో ఈ సినిమా ను రూపొందించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

చిత్రం విడుదల సందర్బంగా దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ.. సస్పెన్స్‌ థ్రిల్లర్ జోనర్‌ లో రూపొందిన సినిమా ఇది. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ను వ్యక్తం చేశాడు.

సినిమా లో ఎవరు ఊహించని ట్విస్ట్‌ లు మరియు మలుపులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చాలా విభిన్నమైన కథతో ఈ సినిమా ను రూపొందించినట్లుగా ఆయన చెబుతున్నాడు. ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరం కూడా చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్క వర్గం ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ను ఆయన వ్యక్తం చేశాడు. ఈ సినిమా విడుదలకు స్క్రీన్ మాక్స్ ప్రసాద్‌ సహకరించారని.. ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.