Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : ప్లాస్టిక్ సర్జరీతో పూర్తిగా మారిపోయింది
By: Tupaki Desk | 12 Nov 2020 12:20 PM ISTతెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ సోనియా అగర్వాల్. ఈ అమ్మడు మొదటి నుండి కూడా కాస్త బొద్దుగా ముద్దుగా కనిపించేది. కాని ఇప్పుడు ఈ అమ్మడు పూర్తిగా మారిపోయింది. తన అందంను పెంచుకోవడం కోసం అంటూ బరువు తగ్గి ఫేస్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఆపరేషన్ తో ఫేస్ లో చాలా మార్పు వచ్చింది. అసలు ఆమెను ప్రేక్షకులు గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఆఫర్ల కోసం ఇలాంటి పని చేసిన ఈ అమ్మడికి ఇప్పటికి అయినా ఛాన్స్ లు వస్తాయా అనేది చూడాలి.
వ్యక్తిగత జీవితానికి వస్తే దర్శకుడు సెల్వ రాఘవన్ తో విడాకులు తీసుకుంది. విడాకుల సమయంలో వివాదాస్పదం అయిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం వామ్మురై అనే సినిమాలో మినహా మరే సినిమాలో ఈ అమ్మడు నటించడం లేదు. అది కూడా ఎప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చేనో క్లారిటీ లేదు. బరువు పెరగడంతో పాటు మొహం కూడా చాలా మారడంతో ఈమెను అభిమానించే వారు కూడా పెదవి విరుస్తున్నారు. కృత్రిమంగా అందంను పెట్టుకోవాలని చూస్తే ఇలాగే ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.