Begin typing your search above and press return to search.

కొరియాలో 'దృశ్యం' రీమేక్..'పారాసైట్' ఫేం హీరో!

By:  Tupaki Desk   |   22 May 2023 4:30 PM IST
కొరియాలో దృశ్యం రీమేక్..పారాసైట్ ఫేం హీరో!
X
మాల‌యాళం 'దృశ్యం' ప్రాంచైజీ పాన్ ఇండియాలో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. 'దృశ్యం' మల‌యాళంలో పాటు..త‌మిళ‌..హిందీ భాష‌ల్లోనూ రీమేక్ అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్రాంచైజీ నుంచి మ‌రిన్ని చిత్రాలు రానున్నాయి. ఇప్ప‌టికే త‌దుప‌రి భాగానికి సంబంధించి సృష్టి క‌ర్త‌ జీతూజోసెఫ్ భారీ ఎత్తున తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

పాన్ ఇండియాలో ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. బ‌డ్జెట్ ని సైతం భారీగా పెంచాల‌ని చూస్తున్నారు. ఈ ప్రాంచైజీ కేవ‌లం క‌థాబ‌లంతోనే ప్రేక్ష‌కుల్లో స‌క్సెస్ అయింది. ఈ నేప‌థ్యంలో 'దృశ్యం' చిత్రాన్ని కొరియ‌న్ భాష‌లోనూ రీమేక్ అవుతుంది. ద‌క్షిణ కొరియాకి చెందిన అంథాల‌జీ స్టూడియోస్ తో క‌లిసి ప‌నోర‌మా స్టూడియోస్ నిర్మించ‌డానికి రెడీ అవుతోంది.

ఇందులో 'పారాసైట్' ఫేం సాంగ్ కాంగ్ హో హీరోగా ఎంపిక‌య్యాడు. 'దృశ్యం' ప్రాంచైజీ చిత్రాలు కొరియ‌న్ భాష‌లో నిర్మించ‌డానికి ఎంతో ఉత్సాహం ఉన్నా. దీంతో ఈ క‌థ ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌కు చేరువ అవ్వ‌డ‌మే కాదు.

భార‌తీయ సినిమాని మ‌రోసారి ప్ర‌పంచ ప‌టంలో నిలిచేలా అవుతుంది అని నిర్మాత కుమార్ మంగ‌త్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక కొరియ‌న్ భాష‌లో రీమేక్ అవుతున్న తొలి భార‌తీయ చిత్రం ఇదే కావ‌డం విశేషం.

ఇంత‌వ‌ర‌కూ ఏ హిందీ సినిమాగానీ..తెలుగు నుంచి గానీకి ఇత‌ర ఏ భాష‌కు చెందిన సినిమా అక్క‌డ రీమేక్ అవ్వ‌లేదు. అయితే అయా భాష‌ల్లో మ‌న సినిమాలు చాలా రిలీజ్ అయి మంచి స‌క్సెస్ సాధించాయి.

ఈ నేప‌థ్యంలో 'దృశ్యం' ప్రాంచైజీని నేరుగా అక్క‌డికి తీసుకెళ్తున్నారు. అలాగే కొరియ‌న్ సినిమాలు భార‌తీయ భాష‌ల‌లో చాలా చిత్రాలు రీమేక్ అయ్యాయి. బాలీవుడ్..టాలీవుడ్...కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లు అక్క‌డ హిట్ చిత్రాల్ని రీమేక్ చేసి హిట్లు అందుకున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రిన్ని కొరియన్ సినిమాలు డంపింగ్ సంఖ్య‌ పెరుగుతుంది.