Begin typing your search above and press return to search.

ఒక్కటైనా రిలీజ్‌ కాలేదు.. అప్పుడే రెండోది

By:  Tupaki Desk   |   11 April 2015 10:38 AM IST
ఒక్కటైనా రిలీజ్‌ కాలేదు.. అప్పుడే రెండోది
X
టాలీవుడ్‌ చిత్రవిచిత్రమైనది. ఇక్కడ అవకాశాలు ఎవరిని ఎలా వరిస్తాయో ఎవరూ చెప్పలేరు. ఇది ఊహాతీతమైనది. నచ్చితే చాలు పట్టంగట్టేస్తుంది. ముఖ్యంగా కథానాయికలకు అవకాశాలు వాటంతట అవే వచ్చేస్తుంటాయి. ఓ సినిమాలో నటిస్తోంది అని తెలియగానే ఆ సెట్‌లో చూసిన వేరే నిర్మాత కొత్త సినిమాలో అవకాశం ఇచ్చేస్తాడు. అలా ఎందరో నాయికలు అవకాశాలు అందుకున్నారు. పట్టుదల, కృషి, ప్రతిభ, సత్‌ప్రవర్తన.. ఉంటే చాలు.. ఇక్కడ అవకాశాలు వాటంతట అవే వెంటపడతాయి.

ఇప్పుడు అదే కోవలో హరహర మహాదేవ టెలీసీరియల్‌తో ప్రపంచానికి పరిచయమైన సోనారిక అనే ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో వరుసగా రెండు అవకాశాలొచ్చాయి. తొలిసినిమా 'జాదూగాడు' (సుమంత్‌ అశ్విన్‌) రిలీజ్‌ కాకముందే ఈ భామకు మరో అద్భుతమైన అవకాశం వచ్చింది. అల్లుడు శీనుతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరసన అవకాశం అందుకుంది. భీమనేని శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ముహూర్త కార్యక్రమం పూర్తి చేసిన ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. అదీ సంగతి.