Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సోనారిక గారి బాల్కనీ భంగిమలు!

By:  Tupaki Desk   |   22 April 2020 6:00 AM IST
ఫోటో స్టోరీ: సోనారిక గారి బాల్కనీ భంగిమలు!
X
సోనారికా భడోరియా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయిన భామ. అయితే మరీ ఎక్కువ పాపులారిటీ మాత్రం లేదు. 'జాదూగాడు'.. 'స్పీడున్నోడు'.. 'ఈడో రకం ఆడో రకం' సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. హాటు భామల సంప్రదాయం పాటించే భామ కావడంతో సోషల్ మీడియాలో సూపర్ స్పీడు చూపిస్తూ దూసుకుపోతూ ఉంటుంది. ఏదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే పాపకు నిద్ర పట్టదు. అందుకే అప్డేట్లు ఇచ్చి.. తాపీగా నిద్రపోతుంది. జనాల నిద్రను హుష్ కాకీ చేస్తుంది.

సోనారిక మరోసారి అదే పని చేసేందుకు కంకణం కట్టుకుంది. కాసేపటి క్రితం ఈ భామ తన ఇన్స్టాఖాతా ద్వారా రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "మనం ఉన్నామనేది ఎంత అరుదు.. ఎంత అందమైన విషయం" అంటూ పూర్తిగా అర్థమయ్యి అర్థం కాని ఓ రకమైన వేదాంత భావనలతో ఉన్న క్యాప్షన్ ఇచ్చింది. నిజానికి మనం ఏం పీకలేదని చాలామంది రోజూ ఏడుస్తూ ఉంటారు. అసలు బ్రతకాడానికి ఏం పీకాల్సిన పని లేదు. 'జస్ట్ మనం పైకి పోకుండా ఉన్నామనేది కూడా గొప్పవిషయమే' .. ఏం పీకకపోయినా చాలు జస్ట్ ఇంట్లో ఉంటే కూడా అది కూడా గొప్ప విషయమే.. నిజానికి అదే అన్నిటికంటే కష్టమైన విషయమని ఇప్పటికే లాక్ డౌన్ మనకు తెలిసి వచ్చేలా చేసింది కదా?

ఫోటో విషయానికి వస్తే క్రీం కలర్ ప్యాంట్.. షార్ట్ గా ఉండే టాప్ ధరించి తను ఉండే ఫ్లాట్ బాల్కనీలో సూర్యుడి కిరణాలు పడుతూ ఉంటే.. ఎంతో వయ్యారంగా నిలుచుంది. కళ్ళు మూసుకుని తన్మయత్వంలో ఉన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టింది. లాక్ డౌన్ లోనే ఇలాంటి ఎక్స్ ప్రెషన్లుపెడితే .. పూర్తి స్వేచ్ఛ ఇచ్చి బీచ్ ని జింతాత జిత జిత చెయ్యమంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భయంగాఉంది. ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు పెట్టారు నెటిజన్లు. "అస్లీ సోనా".. "అంత గొప్ప విషయం ఏముంది?".. "సోనా ఆన్ ఫైర్" అంటూ కొందరు స్పందించారు.