Begin typing your search above and press return to search.

జాదూగాడు స్పెషల్: చేయాల్సిందల్లా చేసింది

By:  Tupaki Desk   |   27 Jun 2015 7:30 AM GMT
జాదూగాడు స్పెషల్: చేయాల్సిందల్లా చేసింది
X
జాదూగాడు సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలకు కొన్ని లెక్కలు వుంటాయి వారి జీవితాలు ఎలా వుండాలి అన్న విషయంలో. అలాగే హీరోయిన్ గా పరిశ్రమలో నిలదొక్కుకోడానికి కొన్ని లెక్కలున్నాయి. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సోనారిక బదూరియా ఆ లెక్కల్ని పెంచేంత స్థాయిలో కనిపించింది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

మొదటి సినిమా అని ఏ మాత్రం తడబాటు లేకుండా తాను చేయాల్సిందల్లా చేసింది. అనుష్క సూపర్ సినిమాలో ఎలా కైపెక్కిన్చిందో.. దానికి ఏ మాత్రం తీసిపోకుండా సోనారిక తన సోయగాలను ఆరబోసింది. ఇంకా ఆ సినిమాలో ఒక పాటలోనే నాగ్ తో రొమాన్స్ చేసింది అనుష్క. ఈ సినిమా మొత్తం శౌర్యని వదలనే లేదు సొనారిక. అంతలా అల్లుకుపోయింది. ఇలాంటి ఫక్తు మాస్ సినిమాకి ఒక హీరోయిన్ ఇంతకన్నా చేయడానికి ఏమీ లేదు. అసలు భక్తిరస పాత్రల్లో నటించింది ఈ సోనారికేనా అని అందరూ గుడ్లప్పగించి.. ముక్కున వేలేసుకునేలా అందాల విందు పెట్టింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి సెంటిమెంట్ సన్నివేశం ఒకటే వున్నా అందులోనూ ఆదరగొట్టింది. బన్నీ సినిమాలో తీసుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే వారి నిర్ణయం అభినందినందగ్గదే..!