Begin typing your search above and press return to search.

భామకి ఫస్ట్ హిట్టా.. హ్యాట్రిక్ ఫట్టా

By:  Tupaki Desk   |   13 April 2016 3:30 PM GMT
భామకి ఫస్ట్ హిట్టా.. హ్యాట్రిక్ ఫట్టా
X
మంచు విష్ణు - రాజ్ తరుణ్ లు నటించిన మల్టీస్టారర్ మూవీ 'ఈడో రకం ఆడో రకం' రేపు విడుదల కానుంది. కన్ఫ్యూజింగ్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీపై ఇండస్ట్రీలో అంచనాలు చాలానే ఉన్నాయి. మంచు హీరోతో పాటు వరుస సక్సెస్ లతో జోష్ మీదున్న రాజ్ తరుణ్ కూడా నటించడంతో.. ఈ మూవీ సక్సెస్ పై హోప్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఈడో రకం ఆడో రకంపై అందరికంటే ఎక్కువగా హీరోయిన్ సోనారికా భడోరియా ఆశలు పెట్టుకుంది.

ఈ మల్టీ స్టారర్ మూవీతో అయిన తన దశ తిరుగుతుందని, టాలీవుడ్ లో తొలి హిట్ అందుకోవాలని కోరుకుంటోంది. ఇప్పటికే ఈ కుర్రభామ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫట్ మన్నాయి. జాదూగాడు అంటూ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామకు.. అరంగేట్రంలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత స్పీడున్నోడు అంటూ మరో చిత్రంతో వచ్చినా.. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా షాక్ ఇచ్చాడు. దీంతో ఇక అమ్మడి కెరీర్ అటకెక్కేసినట్లే అనుకుంటున్న టైంలో మంచు విష్ణు సరసన ఈడో రకం ఆడో రకంలో ఆఫర్ వచ్చింది.

ఇఫ్పుడీ మూవీ హిట్ అయితే.. సోనిరికా భడోరియాకి ఫస్ట్ హిట్ వస్తుంది. ఒకవేళ ఇది కూడా షాక్ ఇస్తే మాత్రం.. హ్యాట్రిక్ ఫ్లాప్స్ కొట్టిన భామగా రికార్డ్ సృష్టిస్తుంది. అప్పుడు ఆఫర్లు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అందుకే ఈడో రకం ఆడో రకంపై చాలానే ఆశలు పెట్టుకుంది సోనారికా భడోరియా.