Begin typing your search above and press return to search.

పాపా సోనారికా.. కొంచెం కంట్రోల్!!

By:  Tupaki Desk   |   29 April 2016 11:00 AM IST
పాపా సోనారికా.. కొంచెం కంట్రోల్!!
X
హీరోయిన్లు.. ముఖ్యంగా కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలో పాతుకుపోవడానికి ఉన్నది ఒకటే దారి. ట్యాలెంట్ ఉన్నా సరే.. కుర్ర భామలు అందాలు ఆరబోస్తే.. డిమాండ్ ఉంటుంది. ఈ విషయాన్ని కొత్తగా ఎంట్రీ ఇచ్చే సుందరాగులు బాగానే వంట బట్టించుకుంటున్నారు. అందుకే అవకాశం రాగానే విచ్చలవిడిగా వయ్యారాలు ఒలకబోసేస్తున్నారు.

జాదూగాడు అంటూ నాగశౌర్యకు హీరోయిన్ గా సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి సోనారికా భడోరియా రూట్ ఒకవైపే ఉంది. కనీసం ట్యాలెంట్ అనే రెండోవైపు చూపించేందుకు పెద్దగా ట్రై చేయడం లేదనే విమర్శలు ఉన్నా.. అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. దీనికి కారణం అమ్మడి అందాల ఆరబోతే. స్పీడున్నోడు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన కూడా ఇదే రూట్ ఫాలో అయింది. రీసెంట్ గా విడుదలైన ఈడో రకం ఆడో రకం మూవీలో మంచు విష్ణుకు జంటగా నటించింది సోనారిక.

ఈడో రకం ఆడో రకంలో అయితే.. సోనారిక విశ్వరూపం చూపించేసింది. అది కూడా అందాల ఆరబోతలోనే కావడం విశేషం. మూవీ మొత్తం మీద అమ్మడు కనిపించే ఏ సీన్ లో అయినా సరే.. క్లీవేజ్ షో కంపల్సరీ. ఆఖరికి దేవుడికి దండం పెట్టుకునే సీన్ లో కూడా ఎద అందాలను ఒలకబోస్తూనే ఉంది. మరి అలాంటి డ్రసింగ్ ఫ్యాషన్ అనుకుందో.. వచ్చిన ఛాన్స్ వదలకూడదని అనుకుందో కానీ.. విచ్చలవిడిగా క్లీవేజ్ షో చేసేసింది. అందాల ఆరబోత ఓకే కానీ.. మరీ ఇంత ఎక్కువగా చూపించేస్తే.. తర్వాత చూపించడానికి ఇంకేముంటుంది అనే క్వశ్చన్ రెయిజ్ అవుతోంది. జర జాగ్రత్త సోనారికా.!!