Begin typing your search above and press return to search.

ఇలా అయితే ఇంటికి పంపేస్తార‌మ్మో

By:  Tupaki Desk   |   10 Jan 2016 7:30 AM GMT
ఇలా అయితే ఇంటికి పంపేస్తార‌మ్మో
X
సోనారికా బ‌దారియా... ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ స‌ర్కిల్స్‌ లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఇది. అప్ప‌ట్లో నాగ‌శౌర్య స‌ర‌స‌న జాదూగాడు అనే చిత్రంలో క‌నిపించింది. తొలి సినిమాతోనే హాట్ అన్న టాక్ వినిపించింది. చూడ‌టానికి కాస్త బొద్దుగా క‌నిపించినా అమ్మ‌డిలో ఒంపుసొంపుల వ‌య్యారాలున్నాయ‌ని పొగిడేశారంతా. స‌రిగ్గా అదే పాయింటు ఈ అమ్మ‌డి కెరీర్‌ కి అస్సెట్ అయ్యింది. ఇప్ప‌టికిప్పుడు రెండు సినిమాలలో అవ‌కాశాలు అందుకుంది. ఒక‌టి మంచు విష్ణు - రాజ్‌ త‌రుణ్ హీరోలుగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏ.కె.ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో సోనారిక క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుంది. సేమ్ టైమ్ బెల్లంకొండ శ్రీ‌ను స‌ర‌స‌న భీమ‌నేని సినిమాలో మ‌రో ఛాన్స్ కొట్టేసింది. ఇవి రెండూ ప్ర‌స్తుతం ఆన్‌ సెట్స్ ఉన్నాయి. అయితే రెండో సినిమాకే సోనారిక‌లోని సెగ‌లు టాలీవుడ్‌ లో చ‌ర్చ‌కొచ్చాయి.

ఈ భామ ఆన్‌ సెట్స్‌ కి వ‌స్తే సింగిల్‌ గా రాదు. క‌నీసం మ‌మ్మీనో - డాడీనో వెంట‌పెట్టుకుని అయినా రాదు. ఏకంగా బోయ్‌ ఫ్రెండ్‌ నే వెంటేసుకుని వ‌చ్చేస్తోంది. పైగా ఆ బోయ్‌ ఫ్రెండ్ ఎప్పుడూ ప్రేయ‌సిని వ‌దిలి ఉండ‌లేడు. త‌న ప‌క్క‌నే ఉండి అన్నీ త‌నే చూసుకుంటున్నాడుట‌. అయితే ఇలాంటి వ్య‌వ‌హారం టాలీవుడ్‌ లో వ‌ర్క‌వుట‌వుతుందా? అంటూ చ‌ర్చ సాగుతోందిప్పుడు. వ్య‌క్తిగ‌త స్టాఫ్ ఉంటారు. మ‌మ్మీ లు వ‌చ్చినా పెద్ద‌గా ప‌ట్టించుకోరు. మ‌రీ ఇలా బోయ్ః ఫ్రెండ్‌ ని వెంటేసుకుని రావ‌డ‌మేంటి చిరాగ్గా. ఇదో పెద్ద న్యూసెన్స్ క‌దా! అని మాట్లాడుకుంటున్నారు. మ‌రి దీనికి ఈ అమ్మ‌డు ఏం స‌మాధానం చెబుతుందో? ఇలా అయితే రెండో సినిమాకే ఇంటికి పంపేస్తార‌మ్మోయ్‌!