Begin typing your search above and press return to search.

చిల్లియానా న‌డుముతో టెంప్ట్ చేస్తున్న హాటీ

By:  Tupaki Desk   |   5 March 2021 7:34 AM GMT
చిల్లియానా న‌డుముతో టెంప్ట్ చేస్తున్న హాటీ
X
`దేవ‌దాస్` సినిమాతో గోవా సోయ‌గం ఇలియానా టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. ఈ గోవా బ్యూటీ స‌న్నజాజి న‌డుముకి టోన్డ్ బాడీ ఒంపు సొంపుల‌కు కుర్ర‌కారు స్పెల్ బౌండ్ అయిపోయారు. ఒక లిరిసిస్ట్ అయితే ఇల్లియానా చిల్లియానా! అంటూ క‌విత‌లే అల్లారు. అంత‌గా ప్ర‌భావితం చేసింది ఇలియానా.

కానీ మ‌ళ్లీ అదే ఒంపు సొంపుల‌తో వేరొక క‌థానాయిక ఎవ‌రూ టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. చూస్తుంటే ఈ అమ్మ‌డు ఆ రేంజు న‌డుమందాల‌తో క‌వ్వించేందుకు రెడీ అవుతోందా? అనే డౌట్లు పుట్టుకొస్తున్నాయ్. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే ఇప్ప‌టికే టాలీవుడ్ కి సుప‌రిచిత‌మైన ఈ బ్యూటీ పేరు సోనారిక బ‌దోరియా.

2015లో జాదుగాడు చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైంది. నాగశౌర్య ఆ చిత్రంలో హీరో. తొలి సినిమా నుంచే తన గ్లామర్‌ షో చేసి హాట్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నటించిన `స్పీడున్నోడు`లోనూ సోనారికా గ్లామ‌ర్ షో ప‌రంగా ఏ మాత్రం తగ్గలేదు. `ఈడోరకం ఆడోరకం`లోనూ న‌టించింది. కానీ స‌రైన హిట్లు లేక‌ తర్వాత తెలుగు పరిశ్రమలో ఆమెకి స‌రైన అవ‌కాశాలే రాలేదు.

అటుపై బాలీవుడ్ లో సాన్ సీన్ అనే చిత్రంలో న‌టించింది. ఇంద్రజిత్ అనే త‌మిళ చిత్రంలోనూ నాయిక‌గా మెప్పించింది. ఇటీవ‌ల ఈ భామ‌కు పెద్ద గ్యాప్ వ‌చ్చింది. దీంతో టీవీ సీరియల్స్ లోనూ న‌టించింది. నిజా‌నికి త‌న‌కు ఆరంగేట్ర‌ లైఫ్‌ ఇచ్చిన సీరియల్స్ ని నమ్ముకుందని చెప్పాలి. మొన్న‌టి వ‌ర‌కూ హిందీ సీరియల్స్ లో నటించింది. హరహర మహదేవ్ సీరియల్ చూస్తున్న ప్రతీ ఒక్కరికి సోనారికతో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందులో పార్వతిగా నటించింది.

ప్ర‌స్తుతం మ‌రోసారి పెద్ద తెర రీలాంచ్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. అవకాశాల కోసం గ్లామర్‌ షోకి దిగింది. అందుకు త‌గ్గ‌ట్టే వేడెక్కించే ఫోజుల‌తో ఈ చెల‌రేగుతోంది. బ్లాక్ టాప్ బ్లూ డెనిమ్ జీన్స్ లో సోనారిక లేటెస్ట్ ఇన్ స్టా ఫోటోలు సోషల్‌ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి. స‌న్న‌జాజి నడుముతో మత్తెక్కించ్చే చూపులతో కుర్రాళ్ళ మైండ్‌ బ్లాంక్ చేసేస్తోంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి. మరి ఇంతగా ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారికకు టాలీవుడ్ పిలిచి ఛాన్సులిస్తుందేమో చూడాలి.