Begin typing your search above and press return to search.

స్పెష‌ల్ విందుకి ఆహ్వానిస్తున్న జాదూగాడు బ్యూటీ

By:  Tupaki Desk   |   5 Dec 2020 3:30 AM GMT
స్పెష‌ల్ విందుకి ఆహ్వానిస్తున్న జాదూగాడు బ్యూటీ
X
ముంబై మోడ‌ల్ కం న‌టి సోనారిక బ‌దోరియా బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోటైన న‌టీమ‌ణిగా సుప‌రిచితం. ఇటు ద‌క్షిణాదినా స్టార్ గా ఎద‌గాల‌ని క‌ల‌లుగంటోంది. ఇటీవ‌ల‌ తమిళంలో ఒక మూవీ.. తెలుగులో ఒక మూవీ చేసింది ఈ భామ‌. సౌత్ లో ప‌లు చిత్రాల‌కు క‌మిట‌వుతోంద‌ని స‌మాచారం.

ముంబై రాజ్‌పుత్‌ ఫ్యామిలీ గాళ్ గా ఫ్యామిలీ బిజినెస్ ల‌లోనూ సోనారిక‌కు అనుభ‌వం ఉంది. త‌న తండ్రి స్థిరాస్తి వ్యాపార రంగంలో ఉన్నారు. నిజానికి కలెక్టర్‌ కావాలని అనుకున్న ఈ అమ్మ‌డు అనుకోకుండా న‌టి అయ్యింద‌ట‌. మొదట టీవిలో ఓ హిందీ సీరియల్ లో నటించింది. అది తెలుగులో కూడా ప్రసారం అయ్యింది.

ఆ త‌ర్వాత వెండితెర అవ‌కాశం అందుకుంది. అప్ప‌ట్లో త‌మిళ చిత్రం `సుందరపాండియన్‌` ను తెలుగులో డబ్‌ చేస్తున్నారని క‌థ‌నాలొచ్చాయి. శౌర్య `జాదూగాడు` తరువాత ఇంకా రెండు కొత్త ప్రాజెక్టులను అంగీక‌రించాన‌ని తెలిపింది. ఈలోగానే ఇక ఈ భామ సోష‌ల్ మీడియాల్లో రెగ్యుల‌ర్ గా వేడెక్కించే ట్రీట్ తో ఆక‌ట్టుకుంటోంది. తాజా ఫోటోషూట్ లో ఫ్లోర‌ల్ థై స్లిట్ డ్రెస్ లో అద‌ర‌గొట్టింది. సూటిగా చురుకైన చూపుల‌తో గుండెల్లో గుచ్చేస్తోంది ఈ అమ్మ‌డు. క‌నీసం టాలీవుడ్ లో క్రేజీ స్టార్ ఎవ‌రైనా అవ‌కాశం ఇస్తారేమో చూడాలి.