Begin typing your search above and press return to search.

ప‌విట జార‌విడిచి మైండ్ బ్లాక్ చేసిన బ్యూటీ

By:  Tupaki Desk   |   8 Nov 2021 12:30 AM GMT
ప‌విట జార‌విడిచి మైండ్ బ్లాక్ చేసిన బ్యూటీ
X
తెలుగు చిత్ర‌సీమ‌కు సోనారిక బ‌దోరియా కొత్తేమీ కాదు. 2015లో జాదుగాడు చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైంది. నాగశౌర్య ఆ చిత్రంలో హీరో. తొలి సినిమా నుంచే తన గ్లామర్‌ షో చేసి హాట్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నటించిన `స్పీడున్నోడు`లోనూ సోనారికా గ్లామ‌ర్ షో యువ‌త‌రానికి ఫుల్ గా కిక్ ఇచ్చింది. `ఈడోరకం ఆడోరకం`లోనూ న‌టించింది. కానీ స‌రైన హిట్లు లేక‌ తర్వాత తెలుగు పరిశ్రమలో వెన‌క‌బ‌డింది. అటుపై బాలీవుడ్ లో సాన్ సీన్ అనే చిత్రంలో న‌టించింది. ఇంద్రజిత్ అనే త‌మిళ చిత్రంలోనూ నాయిక‌గా మెప్పించింది.

మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో మూడు ముక్క‌లాట ఆడినా విజ‌యం వ‌రించ‌క‌పోవ‌డంతో తిరిగి టీవీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లింది. ఇటీవ‌ల ఈ భామ‌కు పెద్ద గ్యాప్ త‌ర్వాత‌ టీవీ సీరియల్స్ తో బిజీ అయ్యింది. నిజా‌నికి త‌న‌కు ఆరంగేట్ర‌ లైఫ్‌ ఇచ్చిన సీరియల్స్ ని నమ్ముకుందని చెప్పాలి. మొన్న‌టి వ‌ర‌కూ హిందీ సీరియల్స్ లో నటించింది. హరహర మహదేవ్ సీరియల్ చూస్తున్న ప్రతీ ఒక్కరికి సోనారికతో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందులో పార్వతిగా నటించి మెప్పించింది. ప్ర‌స్తుతం మ‌రోసారి పెద్ద తెర రీలాంచ్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. అవకాశాల కోసం గ్లామర్‌ షోకి దిగింది. అందుకు త‌గ్గ‌ట్టే వేడెక్కించే ఫోజుల‌తో ఈ చెల‌రేగుతోంది.

సోనారిక స‌న్న‌జాజి నడుముతో మత్తెక్కించ్చే చూపులతో కుర్రాళ్ళ మైండ్‌ బ్లాంక్ చేసేస్తోంది. తాజాగా చీర‌లో స‌న్న‌జాజి న‌డుమును ఆవిష్క‌రిస్తూ సోనారిక ఇచ్చిన ఫోజుకు కుర్ర‌కారు స్పెల్ బౌండ్ అయిపోతున్నారు. ఛ‌మ్కీల మెరుపుల బ్లౌజు.. పింక్ చీర‌లో సోనా అద‌ర‌గొడుతోంది. ఆ కోల‌ముఖానికి త‌గ్గ‌ట్టు చీర‌లో దేవ‌తాసుంద‌రినే త‌ల‌పిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇంతగా ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారికకు టాలీవుడ్ పిలిచి ఛాన్సులిస్తుందేమో చూడాలి.