Begin typing your search above and press return to search.

ఈ అమ్మడు బికినీకి ఏమాత్రం తగ్గకుండా ఊరిస్తుందిగా..!

By:  Tupaki Desk   |   22 Jan 2021 3:47 PM GMT
ఈ అమ్మడు బికినీకి ఏమాత్రం తగ్గకుండా ఊరిస్తుందిగా..!
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సోనమ్ కపూర్ అందాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్లప్పుడూ మోడరన్ దుస్తులతో, స్టైలిష్ లుక్స్ తో యూత్ ను తన అందాల వలలో పడేసుకుంటుంది. సోనమ్ ను ఎప్పుడు చూసినా అప్పుడే దొరికిన ముత్యంలా తలతల మెరుస్తూ ఉంటుంది. అందంతో పాటు సోనమ్ కు మేనిఛాయ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో సోనమ్ గ్లామర్ షోతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. నిజానికి సోనమ్ ను బాగా గమనిస్తే అప్పుడప్పుడు పెళ్లయిందనే విషయం పూర్తిగా మరిచిపోయినట్లు అన్పిస్తుంది. ఎందుకంటే పెళ్లికి ముందుకంటే పెళ్లయ్యాక సోకుల వడ్డన విపరీతంగా పెంచేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందింది కదా ఎంతైనా ఆ మాత్రం డేరింగ్ ఉంటుంది. గ్లామర్ షోలో సోన‌మ్ క‌పూర్ ముందే ఉంటుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో సోనమ్ కపూర్ ఫాలోయర్స్ మిలియన్స్ లో ఉన్నారు. ఈ భామ ఎప్పటికప్పుడు నయా ఫ్యాషన్ దుస్తులు, ఆభరణాలను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేస్తోంది. అందాలప్రదర్శనలో హద్దులు అసలు పెట్టుకోదు సోనమ్. ఇక సోషల్ మీడియాలో సోనమ్ ఫోటోషూట్లతో అదరగొడుతుంది. తాజాగా అమ్మడు 6 సంవత్సరాల క్రితం దిగిన త్రోబ్యాక్ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు అలా బెంచీపై బారుగా పడుకొని ఉంది. స్టైలిష్ డ్రెస్ లో అటు ఎద పరువాలను, ఇటు థైస్ అందాలను ఎరగా వేస్తోంది. మొత్తానికి బికినీకి తక్కువ కాకుండా మెయింటైన్ చేసింది.. ఎందుకంటే అప్పటికి అమ్మడికి పెళ్లి కాలేదు కదా.. ప్రస్తుతం ఈ త్రోబ్యాక్ పిక్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.