Begin typing your search above and press return to search.
క్యాస్టింగ్ కౌచ్.. మేం చెప్పం అంతే
By: Tupaki Desk | 26 April 2018 10:38 AM ISTఈ మధ్య కాలంలో మీడియా వ్యవహారించే తీరు అభ్యంతరకరంగా ఉందంటూ అన్ని చోట్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. తాము వచ్చిన పని.. జరుగుతున్న ఈవెంట్ తో సంబంధం లేకుండా.. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు.. అప్పుడు ఏది రగులుతున్న వివాదం అయితే.. దాని గురించే ప్రశ్నిస్తున్నారు. ఏతా వాతా ఆ వ్యవహారాలు మాత్రమే హైలైట్ అవుతున్నాయి తప్ప.. అసలు ఆ కార్యక్రమం లక్ష్యం నెరవేరడం లేదు.
ఇప్పుడు వీరే ది వెడ్డింగ్ అంటూ నలుగురు భామలు లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. జూన్ 1న రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు యూనిట్. కరీనా కపూర్.. సోనమ్ కపూర్.. స్వర భాస్కర.. శిక్షా తల్సానియాలు ఒకే ఫ్రేమ్ లో దొరకడంతో.. మీడియా వెంటనే క్యాస్టింగ్ కౌచ్ సంగతులను.. ప్రశ్నలను మొదలుపెట్టేసింది. రీసెంట్ గా సరోజ్ ఖాన్ ఈ అంశాన్ని సమర్ధిస్తున్నట్లుగా మాట్లాడడంపై చెప్పమంటూ.. సోనమ్... స్వర భాస్కర్ లను అడిగింది మీడియా.
అయితే.. ఇది సినిమాకు సంబంధించిన ఈవెంట్ అని.. ఈ ప్రశ్నకు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమానికి సంబంధం లేదని చెప్పింది స్వర భాస్కర్. ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడితే.. అదే హైలైట్ అవుతుందని.. అంతే తప్ప ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకున్న ప్రమోషన్ కార్యక్రమం పర్పస్ నెరవేరదని సోనమ్ కపూర్ చెప్పుకొచ్చింది. అందుకే ఆ ప్రశ్నలు మాత్రం అడగద్దని తేల్చేశారు వీరే ది వెడ్డింగ్ యూనిట్. బాగా తెలివిగా వ్యవహరించారు కదూ.
