Begin typing your search above and press return to search.

దివి తారలు దిగివచ్చిన వేళ.. అంటే ఇదేనేమో బహుశా!

By:  Tupaki Desk   |   15 May 2020 2:45 PM GMT
దివి తారలు దిగివచ్చిన వేళ.. అంటే ఇదేనేమో బహుశా!
X
ఇండియన్ సినీ అభిమానుల కలలరాణి.. మాజీ మిస్‌ ఇండియా, బాలీవుడ్‌ బ్యూటీఫుల్ స్టార్ హీరయిన్ లారా దత్తా 2000లో మిస్‌ యూనివర్స్‌ కిరీటం గెలుచుకుంది. ఈ సందర్భంగా 20 సంవత్సరాలు పూర్తి కావడంతో.. బాలీవుడ్ స్టైలిష్ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌ అలనాటి అపురూప ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. మిస్ యూనివర్స్ కిరీటీం దక్కించుకున్న నాటి పాత ఫొటోలు, ఫ్యాన్ పేజీల్లో షేర్ చేసింది. లారా షేర్ చేసిన పాత ఫొటోల్లో ఒక ఫొటోకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఈ అపురూపమైన ఫొటోలో ఇండియన్ బ్యూటీకి ఆనవాళ్లుగా చెప్పుకోదగ్గ అందాల తారలు చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోకు పోజిచ్చారు. టాప్ ఇంటర్నేషనల్ బ్యూటీ ఫెస్టివల్స్, కంపిటేషన్లలో కిరీటాలు సాధించిన సుందరాంగులైన.. సుస్మితా సేన్‌ - మిస్‌ యూనివర్స్‌ 1994, ఐశ్వర్యా రాయ్‌ - మిస్‌ వరల్డ్ 1994, డయానా హేడెన్‌ - మిస్‌ వరల్డ్‌ 1997, యుక్తా ముఖి - మిస్‌ వరల్డ్ 1999, లారా దత్తా భూపతి - మిస్‌ యూనివర్స్‌ 2000, ప్రియాంకా చోప్రా - మిస్‌ వరల్డ్ 2000, దియా మీర్జా - మిస్‌ ఆసియా పసిఫిక్‌ 2000.. ఈ ఫోటోలో కనువిందు చేస్తున్నారు.

ఈ సందర్భంగా తన 20యేళ్ళ కిరీటం పై లారా స్పందిస్తూ.. ‘‘2000 సంవత్సరంలో మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకున్న నాటి నుంచి నేను హద్దులేమి పెట్టుకోలేదు. నేను ఓ నటిగానే ఎప్పుడూ అనుకోలేదు. నేను గీసుకున్న పరిధులను దాటి నేను ఏం చేయగలనో అదే ఆచరించాను. ఆ ఆలోచనా విధానమే నన్ను ముందుకు నడిపిస్తోంది.’’ అని చెప్పింది. మిస్ యూనివర్స్ కిరీటం దక్కిన తర్వాత.. బాలీవుడ్ ‘అందాజ్‌’ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్‌ అవార్డులను అందుకుంది. అప్పటి నుండి మస్తీ, నో ఎంట్రీ, భాగం భాగ్‌, పార్టనర్‌, హౌస్‌ఫుల్, డాన్‌ 2 సినిమాలతో విజయాలను అందుకుంది. ఇక 2011లో ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు మహేష్‌ భూపతిని వివాహం చేసుకొని గృహిణిగా స్థిరపడింది. ఇక ఈ తారల ఫోటో పై అభిమానులు ఫిదా అవుతూ.. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తారలు దిగివచ్చిన వేళ.. అంటే ఇదేనేమో.. అంటూ ఇండియన్ బ్యూటీలు హిస్టరీ క్రియేట్ చేసారని పొగడ్తలతో ముంచుతున్నారు.