Begin typing your search above and press return to search.
అసలు సిసలు హిట్టంటే ఇదేరా..
By: Tupaki Desk | 23 Feb 2016 9:39 AM GMTటాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ ఇప్పుడు ఓపెనింగ్స్ మీదే నడుస్తున్నాయి సినిమాలు. తొలి రోజు వసూళ్లన్నవి చాలా కీలకంగా మారిపోయాయి ఈ రోజుల్లో. సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి తొలి రోజు భారీగా వసూళ్లు రాబట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు నిర్మాతలు. అందుకే సినిమా హిట్టయినా.. ఫ్లాపయినా.. తొలి రోజు వసూళ్లకు మాత్రం ఢోకా ఉండట్లేదు. ఐతే సినిమా అసలు సత్తా ఏంటన్నది రెండో రోజు నుంచే తేలిపోతోంది. వీకెండ్ ముగిసి.. సోమవారం వచ్చేసరికి సినిమాలో సరుకుందా లేదా అన్నది క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతోంది. ఐతే బాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘నీరజ’ అసలు సిసలు హిట్ అనడానికి ఆ సినిమా రెండో రోజు నుంచి సాధించిన వసూళ్లే నిదర్శనం.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ‘నీరజ’కు తొలి రోజు ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయి. శుక్రవారం ఈ చిత్రం రూ.4.7 కోట్లు వసూలు చేసింది. ఐతే రెండు మూడు రోజుల్లో ఈ సినిమా వరుసగా రూ.7.6 కోట్లు.. రూ.9.7 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి రోజు వసూళ్లకు.. తర్వాతి రెండు రోజుల కలెక్షన్లకు ఇంత తేడా ఉండటం అరుదుగా జరుగుతుంది. ఎంత హిట్టు సినిమాకైనా తొలి రోజు తర్వాత కలెక్షన్లు తగ్గుతాయి. కానీ ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. సినిమాకు జనాల్లో ఎంత మంచి టాక్ ఉందో దీన్ని బట్టే అర్థమైపోతుంది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమాకు జనాదరణ బాగానే ఉంది. సోమవారం ‘నీరజ’ రూ.4 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. సోనమ్ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రామ్ మద్వాని దర్శకత్వం వహించాడు. 1986లో హైజాక్ కు గురైన విమానంలో ఉగ్రవాదుల నుంచి ప్రయాణికుల్ని కాపాడ్డానికి ప్రాణ త్యాగం చేసిన నీరజ బానోత్ అనే ఎయిర్ హోస్టెస్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.