Begin typing your search above and press return to search.

వర్కౌట్లతో బిజీ అయిన స్టార్ హీరోయిన్..

By:  Tupaki Desk   |   18 April 2020 4:30 PM GMT
వర్కౌట్లతో బిజీ అయిన స్టార్ హీరోయిన్..
X
సోనమ్ కపూర్ న్యూ ఢిల్లీలోని వారి ఇంట్లో హబ్బీ ఆనంద్ అహుజా, కుటుంబ సభ్యులతో నిర్బంధంలో ఉంది. సోనమ్ కపూర్ కూడా బాలీవుడ్ సెలబ్రిటీలలాగే తన అభిమానులను సోషల్ మీడియాలో రోజు అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ అందుబాటులో ఉంటుంది. భర్త ఆనంద్‌తో కలిసి పనిచేయడం నుండి హెల్తీ కుకీలను కాల్చడం వరకు ఈ ఖూబ్‌సురత్ నటి నిర్బంధంలో ఉండి చేస్తుంది. నిన్న సోనమ్ కుకీలను కాల్చి వాటిని కాల్చే పద్ధతిని కూడా అభిమానులతో పంచుకుంది.

ఈ రోజు ఉదయం.. సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ట్రెడ్మిల్ మీద నడుస్తూ కనిపించింది. ఆ ఫొటోలో సోనమ్ కపూర్ పవర్ పింక్ బ్రా లెట్‌తో బ్లాక్ జెగ్గింగ్స్‌ను ధరించి ఉంది. జిమ్‌లో ఆమె చేసిన కసరత్తులకు సోనమ్ ఒళ్ళంతా చెమటలతో వీడియో పోస్ట్ చేసింది. సోనమ్ ఈ రోజు ఒంటరిగా వ్యాయామం చేసిందట. ఇంతకుముందు ఎప్పుడు చూసినా భర్త ఆనంద్ తో కలిసి వ్యాయామం చేసేది. అంతేగాక సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్ రాసిన ఒక నోటును కూడా పోస్ట్ చేసింది.

ఇక ఇంస్టాగ్రామ్ లైవ్ లో సోనమ్ కపూర్ తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం ఇచ్చింది. 'మీరు నటించిన వీరే ది వెడ్డింగ్ సినిమా సీక్వెల్ 'వీరే ది వెడ్డింగ్ 2' ఎప్పుడు రూపొందిస్తారు? అని అడిగిన ప్రశ్నకు.. ఆ విషయం నాకు తెలియదు. ఆ మూవీ గురించి మీరు నా సిస్టర్ రియాను అడిగితే బాగుంటుందని చెప్పింది. దీనిపై రియా స్పందిస్తూ.. అవును ఆ సినిమా ప్లాన్ ఉంది. త్వరలోనే మీ ముందుకు వస్తుందని మాత్రం చెప్పగలను అని బదులిచ్చింది. ఇప్పుడీ సోనమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.