Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌ర్లిన్ మ‌న్రో స‌మాధి నిదుర లేచొచ్చిందా?

By:  Tupaki Desk   |   1 Nov 2020 1:30 AM GMT
ఫోటో స్టోరి: మ‌ర్లిన్ మ‌న్రో స‌మాధి నిదుర లేచొచ్చిందా?
X
బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా సోనమ్ కపూర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. క‌పూర్ గాళ్ హంస‌న‌డ‌క‌ల‌కు అల్ట్రా మోడ్ర‌న్ స్టైలింగ్ కి ప్యారిస్ హంస‌లైనా త‌ల వొంచాల్సిందే. రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో దుమారం రేప‌డం సోన‌మ్ కి కొత్తేమీ కాదు. కేన్స్ నుంచి హాలీవుడ్ ఇలాకా వ‌ర‌కూ సోన‌మ్ చొర‌వ చూస్తే షాక్ తినాల్సిందే. ఓ ఇంటిద‌య్యాకా సోన‌మ్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. క‌పూర్ ఫ్యామిలీలోనే మోస్ట్ వాంటెడ్ ఫ్యాష‌నిస్టాగా ఇప్ప‌టికీ చెల‌రేగుతూనే ఉంది.

తాజాగా హాలోవీన్ 2020 కోసం ఈ అమ్మ‌డు మార్లిన్ మన్రోగా రూపాంతరం చెందిన తీరు షాక్ కి గురి చేస్తోంది. అందుకు సంబంధించిన మేకోవర్ వీడియోను సోన‌మ్ ఇన్ స్టాలో పంచుకున్నాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. అస‌లు మ‌ర్లిన్ మ‌న్రో స‌మాధి నిదుర నుంచి లేచొచ్చిందా? అంటూ బోయ్స్ ఒక‌టే కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారంటే ఎంత‌గా ఆక‌ట్టుకుందో చెప్పాల్సిన ప‌నే లేదు.

హాలీవుడ్ అంద‌గ‌త్తె మార్లిన్ మన్రో రూపాన్ని సోన‌మ్ పునః ప్ర‌తిష్టించింద‌నే చెప్పాలి. “ఈ హాలోవీన్ లుక్ నాకు కుదిరింది. ఓహ్ నా మన్రో! ఇది నాకు నా బృందానికి ఒక ఆహ్లాదకరమైన అనుభవం. నా ఫేవ‌రెట్ హాలోవీన్ కోసం పునఃసృష్టి చేసినట్లు అనిపిస్తోంది ” అంటూ ఎమోష‌న్ కి గురైంది సోనమ్. సోన‌మ్ తన మేకోవర్ కి సంబంధించి హైపర్ లాప్స్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఆమె జుట్టు అల్లిక స‌హా మేకప్ వేయ‌డం .. విగ్ ధరించడం వరకు సోనమ్ కపూర్ మొత్తం లుక్ కోసం చాలా గంటలు స‌మ‌యం ప‌ట్టింద‌ని వెల్లడించారు. అబ్బాయిలను మోసం చేయవచ్చు.. నా బృందం వారి మాయాజాలం పని చేయడానికి కొన్ని గంటలు పట్టింది. చాలా సంతోషంగా ఉంది ... ” అంటూ వీడియోని షేర్ చేశారు సోన‌మ్.

కెరీర్ సంగ‌తి చూస్తే... సోనమ్ కపూర్ త్వరలో తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సుజోయ్ ఘోష్ ‌తో క‌లిసి ప‌ని చేయ‌నున్నారు. ఈ చిత్రానికి ‘బ్లైండ్’ అనే టైటిల్ ని నిర్ణ‌యించారు.