Begin typing your search above and press return to search.

తండ్రి వల్లే నష్టపోయానంటున్న సోనమ్‌!

By:  Tupaki Desk   |   21 Sep 2016 7:37 AM GMT
తండ్రి వల్లే నష్టపోయానంటున్న సోనమ్‌!
X
సాదారణంగా స్టార్ కిడ్ హోదాలో ఇండస్ట్రీలోకి వస్తే లాంచింగ్ దగ్గరనుంచి పరిస్థితి మామూలుగా ఉండదు. విపరీతమైన ఫాలోయింగ్ - మొదటి సినిమాతోనే స్టార్ హోదా ఇలా చెప్పుకుంటూపోతే స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం మహా అదృష్టం అని చాలా మంది భావిస్తుంటారు. ఇలా అనుకోవడం కూడా చాలావరకూ కరెక్టే! అయితే అది హీరోల విషయంలో సరిగ్గానే సరిపోతుంది కానీ.. కొంతమంది హీరోయిన్స్ విషయంలో రివర్స్ అవుతుంటుంది. ఇలా తన విషయంలో కూడా రివర్స్ అయ్యిందని చెబుతుంది బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌ కపూర్.

అనీల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనం గురించి... ఇక ఈమెకు అవకాశాలు పుష్కలం అని అంతా అనుకుని ఉండవచ్చు కానీ, ప్రస్తుతం పరిస్థితి మాత్రం అలా లేదంటుంది సోనమ్‌. సల్మాన్‌ ఖాన్‌ తో చేసిన "ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో" మినహా ఆమె కెరీర్‌ లో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ లేమీ పడలేదు. ఈ విషయాలపైనే తాజాగా సోనమ్‌ స్పందించింది. తన కెరీర్‌ ఇలా ఉండడానికి తన తండ్రే కారణమని అంటోంది. అవును... అనిల్‌ కపూర్‌ కూతురు కావడం వల్లే తనకు చాలా ఛాన్సులు చేతికందకుండా పోయాయని సోనమ్‌ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

తాను అనీల్ కపూర్ కూతురు అవ్వడం వల్ల సల్మాన్‌ కూడా తనతో నటించనని తెగేసి చెప్పాడని, చివరికి ఎలాగోలా ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై సల్మాన్ మరో ఉద్దేశంతో కాదని.. అలా ఎందుకన్నాడో కూడా చెబుతూ... "అనిల్‌ కపూర్‌ నా క్లోజ్‌ ఫ్రెండ్‌. అతడి కుమార్తెతో నేను ఎలా రొమాన్స్‌ చేయగలను?" అనే కారణం చెప్పిన సల్మాన్ సోనమ్‌ ని తిరస్కరించాడట. ఇదే క్రమంలో మరికొంతమంది స్టార్ హీరోలు కూడా తనను హీరోయిన్ గా తీసుకొవడంపై ఇదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెబుతుంది. ఇలా తన కుటుంబ నేపథ్యం తన కేరీర్‌ కు ఏమాత్రం హెల్ప్‌ అవ్వడంలేదు సరికదా.. కొన్ని సందర్భాల్లో అడ్డుగా కూడ ఉంటుందని చెప్పుకొస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.