Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రంగులలో కలవో.. ఎద పొంగులలో కలవో

By:  Tupaki Desk   |   22 March 2021 5:30 AM GMT
ఫోటో స్టోరి: రంగులలో కలవో.. ఎద పొంగులలో కలవో
X
రంగులలో కలవో.. ఎద పొంగులలో కలవో..రంగులలో కలవో .. ఎద పొంగులలో కలవో.. నవ శిల్పానివో ప్రతి రూపానివో..తొలి ఊహల ఊయలవో..రంగులలో కలవో ఎద పొంగులలో కలవో..

కాశ్మీర నందన సుందరివో..కాశ్మీర నందన సుందరివో...కైలాస మందిర లాస్యానివో...ఆమని పూచే యామినివో...

`అభినంద‌న‌` క్లాసిక్ సినిమా నుంచి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ఇది. బ‌హుశా వెట‌ర‌న్ లిరిసిస్ట్ ఆచార్య ఆత్రేయ అంత అంద‌మైన ప‌దాల అల్లిక చేశారంటే దాని వెన‌క ఇంత‌టి సుంద‌రాంగి దాగి ఉంద‌నే అర్థం. ఎస్పీబీ - జాన‌కి గానం ఇళ‌య‌రాజా సంగీతం ఆ పాట‌కు ప్రాణం పోసాయి.

నాడు అభినంద‌న శోభ‌న‌తో పోలిక క‌నిపిస్తోంది ఈ బొమ్మ‌లో. ఇంత‌కీ ఎవ‌రీ అందాల బొమ్మ అంటే.. ప‌రిచ‌యం చేయన‌వ‌స‌రం లేదు. ది గ్రేట్ బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా సోన‌మ్ క‌పూర్. లెజెండ్ అనీల్ క‌పూర్ వార‌సురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన సోన‌మ్ అవార్డ్ రేంజు పెర్ఫామెన్సెస్ తో మెప్పించింది. దిల్లీ బిజినెస్ మేన్ ఆనంద్ అహూజాని పెళ్లాడాక అరుదుగా మాత్ర‌మే పెద్ద తెర‌పై క‌నిపిస్తున్నారు.

ఇక సొంత ఫ్యాష‌న్ బ్రాండ్స్ ని మార్కెట్లో ప్ర‌వేశ పెట్టి సోన‌మ్ పెద్ద రేంజు ఎంట‌ర్ ప్రెన్యూర్ గా కొన‌సాగుతున్నారు. భ‌ర్త‌తో క‌లిసి సోన‌మ్ ఈ వ్యాపార‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే పాపా అనీల్ క‌పూర్ న‌టించిన ఏకే అండ్ ఏకే లో సోన‌మ్ న‌టించింది. త‌దుప‌రి బ్లైండ్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ లోనూ న‌టిస్తోంది.