Begin typing your search above and press return to search.

లోదుస్తుల్లో గుబులు రేపుతున్న‌ సోన‌మ్

By:  Tupaki Desk   |   14 Nov 2021 4:30 PM GMT
లోదుస్తుల్లో గుబులు రేపుతున్న‌ సోన‌మ్
X
అనీల్ కపూర్ వార‌సురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోన‌మ్ క‌పూర్ కెరీర్ జ‌ర్నీ ప్ర‌తిభ‌ గురించి ప్ర‌స్తావించాల్సిన ప‌నిలేదు. బ్యాక్ ఎండ్ లో తండ్రి స‌పోర్ట్ ఉన్నా.. కెరీర్ పై ఆ ట్యాగ్ ఎంత మాత్రం ప‌డ‌కుండా త‌న ట్యాటెంట్ తోనే ఎదిగింది ఈ బ్యూటీ. ఎన్నో స‌క్సెస్ ల్ని అందుకుని బాలీవుడ్ లో కెరీర్ ని బిల్డ్ చేసుకుంది. జాతీయ అవార్డును అందుకుంది. అటుపై వ్యాపార వేత్త ఆనంద్ అహుజాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నా! ర‌క‌ర‌కాల వ్యాపారాల‌ను నిర్వ‌హిస్తూనే కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తోంది. న‌ట‌వృత్తి విష‌యంలో మాత్రం కేర్ ఫుల్ గానే వ్య‌వ‌హ‌రిస్తోంది. మునుప‌టి అంత దూకుడుని వెండి తెర‌పై చూపించ‌లేదు. మ‌రి ఆఫ్ ది స్క్రీన్ సోన‌మ్ స్పీడ్ గురించి చెప్పాల్సి వ‌స్తే చాలా సంగ‌తులే ఉన్నాయి.

క‌పూర్ డాట‌ర్ కొన్ని ప్ర‌త్యేక‌ ప‌రిమితిలు విధించుకుని ముందుకెళ్తోంది. ఆ మార్జిన్ దాటి బ‌య‌ట‌కు వ‌స్తే సోన‌మ్ చిచ్చ‌ర పిడుగు అని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న టెప్టింగ్ ఫోటోల ఎలివేష‌న్స్ తో చెప్ప‌క‌నే చెప్పింది. పెళ్లైన త‌ర్వాత కొత్త ఫోటో షూట్ల కోసం ఏ రేంజ్ లో అందాలు ఆర‌బోసిందో చెప్పాల్సిన పనిలేదు. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం..వాటిపై నెగిటివ్ కామెంట్లు సోన‌మ్ కి కొత్తేం కాదు. తాజాగా ఈ బ్యూటీ మ‌రోసారి చెల‌రేగిపోయింది. లోదుస్తులు క‌నిపించేలా కెమెరాకి ఫోజులివ్వ‌డం ప్ర‌తిదీ సెన్సేష‌నే. డిజైన‌ర్ డ్రెస్ లో వివిధ ర‌కాల భంగిమ‌ల్లో హోయ‌లు పోయింది. కొన్ని పోటోల కోసం ఏకంగా టాప్ లేపింది అంటే అతిశ‌యోక్తి కాదు.

ప్ర‌స్తుతం మ‌రోసారి లోదుస్తుల ఎలివేష‌న్ తో ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. నెటిజ‌నులు త‌మ‌దైన శైలిలో కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇక సోన‌మ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం `బ్లైండ్` అనే సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అలాగే కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.