Begin typing your search above and press return to search.

బ్యాక్ లెస్ లోనూ మత్తెక్కిస్తోంది

By:  Tupaki Desk   |   23 Feb 2016 11:58 AM IST
బ్యాక్ లెస్ లోనూ మత్తెక్కిస్తోంది
X
బాలీవుడ్లో ప్రస్తుతం ఫ్యాషన్ క్వీన్ ఎవ్వరంటే అక్కడి జనాలు తడుముకోకుండా సోనమ్ కపూర్ పేరు చెప్పేస్తారు. అనిల్ కపూర్ తనయురాలిగా ‘సావరియా’ సినిమాలో చాలా పద్ధతిగా ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగుకాళ్ల సుందరి.. చాలా త్వరగానే ట్రాన్స్ ఫార్మ్ అయిపోయింది. అందాల ప్రదర్శనలో ఏమాత్రం హద్దులు పెట్టుకోకుండా తనదైన శైలిలో రెచ్చిపోయి.. చాలా త్వరగానే తన మీద ఉన్న హోమ్లీ హీరోయిన్ ముద్ర పోగొట్టేసుకుంది. కొన్నాళ్లకు ఒంటి మీద బట్టలెక్కువైతే సోనమ్ ను గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చేసింది. క్లీవేజ్ షోలు చేయడంలో తనకు తానే సాటి అని రుజువు చేసుకుంది.

ఈ మధ్య మరీ బ్రా కూడా లేకుండా న్యూ ఇయర్ పార్టీ చేసుకుని తన గ్లామర్ షోని మరో స్థాయికి తీసుకెళ్లింది సోనమ్. ఐతే ఇప్పటిదాకా ఫ్రంట్ అందాల్ని ఎక్స్ పోజ్ చేయడం మీదే దృష్టిపెట్టిన సోనమ్.. ఇప్పుడు బ్యాక్ బ్యూటీపై కన్నేసినట్లుంది. ఓ సరికొత్త రకం చీరకట్టుకుని బ్యాక్ లెస్ పోజులతోనూ తనదైన శైలిలో పిచ్చెక్కించింది సోనమ్. ఆ చీర ఇంకెవరికీ ఇంత బాగా సెట్టవదేమో అనిపించేలా చాలా అట్రాక్టివ్ గా తయారై వచ్చింది కపూర్ పిల్ల. ప్రస్తుతం ఫ్యాషన్ కు ఫ్యాషన్.. గ్లామర్ కు గ్లామర్ తో బాలీవుడ్ లో తనను కొట్టేవాళ్లెవరూ లేరని మరోసారి చాటుకుంది సోనమ్.