Begin typing your search above and press return to search.

ఆమె ఆద‌మ‌రిచి కునుకేస్తే బోయ్స్ కంటికి నిదురే క‌రువాయే!

By:  Tupaki Desk   |   16 April 2021 11:30 PM GMT
ఆమె ఆద‌మ‌రిచి కునుకేస్తే బోయ్స్ కంటికి నిదురే క‌రువాయే!
X
హిందీ బిగ్ బాస్ 8 బ్యూటీ సోనాలి రౌత్ బికినీ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఈ టాప్ మోడ‌ల్ కం న‌టి బికినీ లుక్స్ నుండి ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వరకు ఫ్యాషన్ ప్రియుల్ని నిరంత‌రం ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఇన్ స్టాలో పంచుకున్న తాజా ఫోటోషూట్ లో సోనాలి మ‌రోసారి త‌న‌దైన శైలిలో ఒంపుసొంపుల్ని రంగ‌రించింది.అలా బ్లాక్ టూపీస్ లో విర‌హంతో వీగిపోతున్న సోనాలి అంద‌చందాలు కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఆద‌మ‌రిచిన అందం అలా క‌వ్విస్తుంటే బోయ్స్ కి చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయ్. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

సోనాలి రౌత్ హిస్ట‌రీ ప‌రిశీలిస్తే.. ఈ బ్యూటీ జ‌ర్నీ ఇంట్రెస్టింగ్. 2010 లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కనిపించిన ఈ బ్యూటీ రొమాంటిక్-థ్రిల్లర్ చిత్రం `ది ఎక్స్‌పోస్` తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. 2014 లో హిమేష్ రేషమ్మీయా- యోయో హనీ సింగ్ సరసన ఈ అమ్మ‌డు న‌టించింది. రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ 8 లో ఈ అమ్మ‌డి ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ సూపర్ మోడల్ ఉజ్జ్వాలా రౌత్ కి చెల్లెలు. ఆమె తండ్రి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కావ‌డంతో సంఘంలో బోలెడంత గుర్తింపు ఉంది.

ఆరంభ‌మే `ది ఎక్స్‌పోజ్‌` లో హత్యకు గురైన సినీ నటి పాత్రలో నటించింది. ఒక ఇంటర్వ్యూలో.. బాలీవుడ్ త‌న‌ను మ‌న‌స్ఫూర్తిగా స్వాగతించలేదు అని నిరాశ‌ను వ్య‌క్త‌ప‌రిచింది. అటుపై రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ ఇంటిలో ప్ర‌వేశించింది. కన్నడ చిత్ర దర్శకుడు ఎస్. కె.బ‌షీద్ `99% యూజ్ లెస్ ఫెలోస్` అనే చిత్రానికి కమిటై అటుపై అర్థాంత‌రంగా వైదొల‌గ‌డంతో వివాదాల్లోకి వ‌చ్చింది. త‌న‌కు క‌మిట్ మెంట్ లేద‌ని బ‌షీద్ మీడియా ముందు చిర్రుబుర్రులాడారు. అటుపై రౌత్ బిగ్ బాస్ 8 లో హ‌డావుడి చేసింది.

2016 లో రౌత్ గ్రేట్ గ్రాండ్ మ‌స్తి చిత్రంలో కనిపించింది. ఇందులో ఆమె షైనీ అనే పాత్ర‌లో నటించింది. `లిప్ స్టిక్ లగా కే` చిత్రం పాటలో న‌ర్తించింది. ప్ర‌స్తుతం రౌత్ ఇటు సౌత్ పైనా దృష్టి సారించింద‌ని తెలుగు ఇండ‌స్ట్రీ పైనా మ‌న‌సు పారేసుకుంద‌ని తెలుస్తోంది.