Begin typing your search above and press return to search.

కంటి చూపు మందగించింది : సోనాలి

By:  Tupaki Desk   |   3 Nov 2018 11:24 AM GMT
కంటి చూపు మందగించింది : సోనాలి
X
బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సోనాలి బింద్రే క్యాన్సర్‌ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్ని నెలలుగా సోనాలి అమెరికాలో క్యాన్సర్‌ కు చికిత్స తీసుకుంటోంది. క్యాన్సర్‌ చికిత్స సందర్బంగా జట్టు తీసేశారని, చాలా బాధగా ఉంటుందని, ఎప్పటికప్పుడు తన బాధను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ వస్తున్న సోనాలి బింద్రే మీ అభిమానంతో అన్నింటిని కూడా ఓర్చుకుంటున్నాను, మళ్లీ మీ ముందుకు మామూలు మనిషిగా వస్తాను అంటూ చెప్పుకొచ్చినవిషయం తెల్సిందే. తాజాగా మరోసారి సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను పలకరించి మరోసారి హృదయాలను ద్రవింపజేసింది.

తాజాగా ‘ఏ లిటిల్‌ లైఫ్‌’ అనే బుక్‌ ను చదివాను చాలా అద్బుతంగా ఉంది. కథ చదువుతున్న సమయంలో నేను ఇబ్బంది పడ్డాను. నా కంటి చూపు మందగించడం వల్ల కాస్త ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. కెమోథెరఫీ చేయించుకుంటున్న కారణంగా కంటి చూపు తగ్గిందని, అయితే మునుపటితో పోల్చితే ఇప్పుడు చాలా బెటర్‌ అంటూ చెప్పుకొచ్చింది.

పుస్తకం గురించి సోనాలి.. స్నేహం - లక్ష్యం నేపథ్యంలో రచయిత మంచి కథను అల్లారు. ఆయన పాత్రలను అద్బుతంగా రూపొందించాడు అంటూ పేర్కొంది. తన పుస్తకం పట్ల స్పందించినందుకు గాను ‘ఏ లిటిల్‌ లైఫ్‌’ పుస్తక రచయిత సోనాలికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు ముందు ముందు మరెందరికో ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సోనాలికి సోషల్‌ మీడియా ద్వారా రీప్లై ఇచ్చాడు.