Begin typing your search above and press return to search.

సోనాలి.. న్యాచురల్ ఫోటో షూట్ విత్ స్కార్!

By:  Tupaki Desk   |   7 March 2019 11:45 AM IST
సోనాలి.. న్యాచురల్ ఫోటో షూట్ విత్ స్కార్!
X
సీనియర్ బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే పోయినేడాది జులైలో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సోనాలి దాదాపు ఎనిమిది నెలలపాటు అక్కడే ఉండిపోయింది. చికిత్స పూర్తయిన అనంతరం ఈమధ్యే ఇండియా కు తిరిగి వచ్చింది. క్యాన్సర్ అని తెలిసిన నాటినుండి సోనాలి తన ఎమోషనల్ జర్నీని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంది.

తను క్యాన్సర్ తో చేసిన ఫైట్ రెగ్యులర్ గా వివరిస్తూ ఉన్న సోనాలి తాజాగా సోనాలి మరో సంచలనాత్మక ఫోటో షూట్ చేసింది. వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్న సోనాలి తన పొట్ట భాగంలో ఉన్న 20 అంగుళాల పొడవైన సర్జరీ గాటును ఏమాత్రం దాచిపెట్టకుండా ప్రదర్శించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటోను పోస్ట్ చేసి ఒక పెద్ద ఎమోషనల్ మెసేజ్ పెట్టింది. మొదట్లో ఈ ఫోటో షూట్ చేసేందుకు తటపటాయించినా ప్రియా తన్నా .. అనైతా ష్రాఫ్ అదజానియా ఇద్దరూ తనకు ధైర్యాన్నిచ్చారని తెలిపింది. పొడవైన జుట్టు లేకుండా.. పెద్దగా మేకప్ లేకుండా ఇలా కెమెరా ముందు కనిపించడం తనకో కొత్త అనుభవమని చెప్పింది.

"ఈ ఎపిసోడ్ తర్వాతా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను .. 'కొత్తగా ఉండే మీ సహజత్వాన్ని కనుక్కోండి'. అది మీకెంతో స్వేచ్చనిస్తుంది." అంటూ ఒక సలహా ఇచ్చింది. నిజమే.. మన లోపాలు..లేదా ఇంకోటో.. మరోటో సొసైటీ నుండి దాచిపెట్టాలని తపనపడే బదులుగా 'నా సహజత్వం' ఇది అని చెప్పిన తర్వాత ఎవరైనా ఏం అనగలరు ... మన ధైర్యానికి నిజాయితీకి మనస్ఫూర్తిగా మనసులో సలాం కొట్టడం తప్ప. ఇంత నిజాయితీగా ఉన్నా ఇంకా ట్రోల్ చేసే జనాల సంగతి అంటారా. జఫ్ఫాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది!