Begin typing your search above and press return to search.

ఫ్లెక్సిబుల్ బ్యూటీని ప‌ట్టించుకోని ఇండ‌స్ట్రీ!

By:  Tupaki Desk   |   12 Sep 2021 4:58 AM GMT
ఫ్లెక్సిబుల్ బ్యూటీని ప‌ట్టించుకోని ఇండ‌స్ట్రీ!
X
అందం ఉంది.. కైపు ఉంది.. కావాల్సినంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. కానీ ఏం లాభం ఈ బ్యూటీని దర్శ‌క‌నిర్మాత‌లు హీరోలు ప‌ట్టించుకోవ‌డం లేదు మ‌రి. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ..? ఆగ్రా అంద‌గ‌త్తె సోనాల్ చౌహ‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. హ్యాపీడేస్ రాహుల్ స‌ర‌స‌న‌ `రెయిన్ బో` చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అటుపై బాల‌య్య సినిమాల‌తో ఫేమ‌స్ అయింది. న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన`లెజెండ్`..`డిక్టేట‌ర్`..`రూల‌ర్` చిత్రాల్లో న‌టించింది. `లెజెండ్` మిన‌హా మిగ‌తా రెండు చిత్రాలు స‌రైన ఫ‌లితాలు సాధించ‌లేదు. అలాగే ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `పండ‌గ చేస్కో`లోనూ న‌టించింది. ఈ సినిమా మంచి స‌క్సెస్ అయింది. కానీ సోనాల్ టాలీవుడ్ కెరీర్ ఆశించినంత‌గా సాగ‌లేదు. ద‌శాబ్ధం కాలం నుంచి ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నా ఏ ద‌శ‌లోనూ అమ్మ‌డు బిజీ హీరోయిన్ గా మార‌లేక‌పోయింది.

త‌మిళ్..హిందీ భాష‌ల్లోనూ కొన్ని చిత్రాల్లో న‌టించింది. కానీ అక్క‌డా కలిసి రాలేదు. ఈ ఏడాది ఆరంభంలోనే `ది ప‌వ‌ర్` అనే సినిమా రిలీజ్ అయింది. ఇందులో విద్యుత్ జ‌మ్వాల్..శ్రుతి హాస‌న్ తో పాటు సోనాల్ న‌టించింది. కానీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అంత ఇంపాక్ట్ చూపించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం చేతిలో ఎలాంటి అవ‌కాశాలు లేకుండా ఖాళీగా ఉంది. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డు కాన్సంట్రేష‌న్ అంతా జిమ్..యోగా సెష‌న్ల‌పైనే పెట్టిందిట‌. సోనాల్ యోగాస‌నాలు వేసిన కొన్ని తాజా ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. ప‌సుపు వ‌ర్ణం స్కిన్ టైట్ లో యోగా చేస్తోన్న ఓ ఫోటో వైర‌ల్ అవుతోంది.

ఇందులో వెన్నుని వంచుతూ సాహ‌సం చేస్తోంది సోనాల్. త‌న‌ రెండు చేతులు.. కాళ్లు.. ముఖం ప్ర‌తిదీ వెన‌క్కి మ‌డిచి రిస్క్ చేసింద‌నే చెప్పాలి. ఒక కాలితో వెన‌క్కి ఆన్చిన చేతిని తాకింది. ఆస‌నం చూడ‌టానికి సింపుల్ గానే ఉన్నా కానీ ఇలా వెన్ను విరుచుకుని బ్యాలెన్సింగ్ చేయ‌డం అన్న‌ది అనుభ‌వాన్ని బ‌ట్టే వ‌స్తుంద‌ని నిరూపించింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్ హాట్ ఫోటోల‌తో సోనాల్ విరుచుకుపుడుతూనే ఉంటుంది. బికీనీ..టూపీస్ ల్లో సోనాల్ ఒంట‌రి దీవుల‌ విహారం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.