Begin typing your search above and press return to search.

బాలయ్యతో సోనాల్‌ జాతరే జాతర

By:  Tupaki Desk   |   2 July 2015 11:47 AM IST
బాలయ్యతో సోనాల్‌ జాతరే జాతర
X
లెజెండ్‌తో రీఎంట్రీ ఇచ్చింది సోనాల్‌ చౌహాన్‌. రావడమే అదరగొట్టేసింది. హాట్‌ లేడీని తెలివిగా ఒడిసిపట్టుకున్నాడని బోయపాటికి పేరొచ్చింది. మునుపటిలా కనిపిస్తే లాభం లేదనుకున్న ఈ అమ్మడు వస్తూనే వలువలు విప్పి పందేరం వేసింది. యువతరం నాడులన్నీ స్థంబించిపోయేలా చేసింది. లెజెండ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్టవ్వడంలో సోనాల్‌ గ్లామర్‌కి భాగం ఉంది.

ఆ తర్వాత పండుగ చేస్కో చిత్రంలోనూ రామ్ సరసన ఓ రేంజులో రెచ్చిపోయింది. సినిమా యావరేజ్‌ అయినా ఈవిడ గ్లామర్‌తో కిక్కు మీద కిక్కిచ్చింది. వరుసగా విజయాలతో సక్సెస్‌ హీరోయిన్‌గా పాపులరైపోయిందిప్పుడు. అందుకే ఇదే క్రేజుతో మరో క్రేజీ ప్రాజెక్టును ఖాతాలో వేసుకుంది అమ్మడు. ముచ్చటగా మరోసారి బాలయ్య సరసన అవకాశం అందుకుంది. నటసింహా బాలయ్యతో సోనాల్‌ జోడీ బావుందని యువతరంలో ఇప్పటికే టాకుంది కాబట్టి మరో హిట్టొస్తుందని దర్శకనిర్మాతలు సెంటిమెంటు ఫీలయ్యారట. అందుకే సోనాల్‌ని వెతికి మరీ పట్టుకున్నారు.

ఇప్పటికే బాలయ్య 99వ సినిమాలో అంజలి ఓ కథానాయికగా నటిస్తోంది. ప్రధాన నాయిక కోసం ఇన్నాళ్లు వెతికి వెతికి చూశారు. కానీ చివరికి సోనాల్‌ సరైన ఆప్షన్‌ అని భావించి అవకాశం ఇచ్చారు. సోనాల్‌ రొట్టె విరిగి మరోసారి నెయ్యిలో పడిందన్నమాట. ఇవే కాకుండా కళ్యాణ్‌రామ్‌తో షేర్‌, ఆర్య-అనుష్కతో సైజ్‌ జీరో సినిమాల్లో సొనాల్‌ నటిస్తోంది.