Begin typing your search above and press return to search.

బాలయ్య హీరోయిన్ని మళ్లీ తోసేశారుగా

By:  Tupaki Desk   |   9 Sept 2016 4:00 AM IST
బాలయ్య హీరోయిన్ని మళ్లీ తోసేశారుగా
X
అప్పుడెప్పుడో ‘రెయిన్ బో’ అనే సినిమాలో ఇలా మెరిసి అలా మాయమైంది ముంబయి బ్యూటీ సోనాల్ చౌహాన్. అందులో ఆమె టాలెంట్ చూపించడానికి పెద్దగా అవకాశం దక్కలేదు. పైగా ఆ సినిమా ఓ తలపోటు వ్యవహారం. దీంతో సోనాల్ గురించి అసలు డిస్కషనే లేదు అప్పట్లో.

ఐతే ‘లెజెండ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సోనాల్.. ఈసారి మాత్రం కుర్రాళ్లలో వేడి పుట్టించింది. తన హాట్ హాట్ అందాల్ని తెరంతా ఆరబోసి తనలోని మరో యాంగిల్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత పండగచేస్కో - షేర్ - డిక్టేటర్ లాంటి సినిమాల్లో ఇదే తరహాలో రెచ్చిపోయిన సోనాల్.. సెకండ్ ఇన్నింగ్స్ ను బాగానే పొడిగించుకునేలా కనిపించింది. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆమె మీద మళ్లీ శీత కన్నేశాడు టాలీవుడ్ ఫిలిం మేకర్స్. డిక్టేటర్ రిలీజై ఎనిమిది నెలలవుతోంది. సోనాల్ మళ్లీ తెలుగు తెర మీద కనిపించలేదు.

అందాల ప్రదర్శనకు ఎంతమాత్రం అడ్డు చెప్పకున్నా.. ఆమెకు కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఉన్నా.. అవకాశాలు ఇవ్వట్లేదు. మరోసారి ఆమెకు టాలీవుడ్ టాటా చెప్పేసినట్లే కనిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్లోనూ సోనాల్ కెరీర్ ఏమంత గొప్పగా ఉన్నట్లు లేదు. అక్కడ కూడా ఒకటో రెండో సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే మరోసారి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకోవడానికి ఓ హాట్ ఫొటో షూట్ చేసింది సోనాల్. ఆ షూట్ మళ్లీ ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూద్దాం.