Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : కళ్లు తిప్పుకోనివ్వని అందాల విందు

By:  Tupaki Desk   |   5 Jun 2022 3:30 PM GMT
ఫోటోటాక్‌ : కళ్లు తిప్పుకోనివ్వని అందాల విందు
X
హీరోయిన్‌ గా కెరీర్‌ ఆరంభించి పుష్కర కాలం దాటినా కూడా ఇంకా అడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్‌. అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న సోనాల్ చౌహాన్ కు అదృష్టం కలిసి రాకపోవడంతో ఇప్పటి వరకు స్టార్‌ డమ్‌ ను సొంతం చేసుకోలేక పోయింది. ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్ సినిమాలు చేసినా చేయకున్నా కూడా తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఈమద్య కాలంలో ఇన్ స్టా గ్రామ్‌ లో వరుసగా తన హాట్‌ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ తన యొక్క అందాల ఆరబోత వీడియో లను మరియు ఫోటోలను అభిమానులతో పంచుకోవడంతో మరింతగా జనాలకు చేరువ అవుతోంది. ఒక హీరోయిన్‌ సినిమాలోనే కాకుండా ఇలా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండి అందాలను ఆరబోస్తూ ఆకట్టుకోవచ్చు అని ఈ అమ్మడు తన ఫాలోయింగ్‌ తో నిరూపించుకుంది.

అప్పుడెప్పుడో పండగ చేస్కో... లెజెండ్‌ సినిమాలతో సక్సెస్ లను దక్కించుకున్న సోనాల్‌ చౌహాన్‌ ను జనాలు ముఖ్యంగా తెలుగు జనాలు ఇంకా కూడా గుర్తు ఉన్నారు అంటే ఆమె స్కిన్‌ షో కారణం అనడంలో సందేహం లేదు. తన అందంతో కళ్లు తిప్పుకోనివ్వని ఈమె సోషల్‌ మీడియాలో చేసే రచ్చ కారణంగానే ఈ అమ్మడికి ఇలాంటి క్రేజ్ దక్కింది.

తాజాగా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు మరోసారి ఆమె అందం గురించి చర్చ వచ్చేలా చేసింది. ఇంత అందంగా ఉన్న సోనాల్‌ చౌహాన్ సినిమాల కోసం.. ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు అంటూ అభిమానులు ఈ ఫోటోకు తెగ కామెంట్స్ చేస్తూ తమ విచారంను వ్యక్తం చేస్తూ ఉన్నారు.

తాజాగా ఈమె ఎఫ్‌ 3 సినిమా లో చిన్న పాత్రలో నటించి అందులో కూడా తన అందంతో వావ్‌ అనిపించింది. తమన్నా మరియు మెహ్రీన్ లకు ఏమాత్రం తగ్గకుండా తన అందంతో అదరగొట్టేసింది. త్వరలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా లో చిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.