Begin typing your search above and press return to search.
సోనాల్ .. ఈ కష్టం ఫలించి మళ్లీ టాలీవుడ్ లో..!
By: Tupaki Desk | 26 April 2021 7:00 PM ISTజన్నత్ సినిమాతో హిందీ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చినప్పుడు తనకు ఇంతటి జర్నీ ఉంటుందని సోనాల్ ఊహించిందా? కానీ ఊహించనిది జరగడమే జీవితం. కెరీర్ లో పెద్ద స్టార్ అయిపోకపోయినా స్టార్ హీరోలతో నటించిన మాట నిజం. రంగుల మాయా ప్రపంచంలో ఇంత పోటీలో తనకంటూ కొన్ని గుర్తింపు ఉన్న సినిమాల్ని చేసింది సోనాల్. నటసింహం నందమూరి బాలకృష్ణ రెండుసార్లు అవకాశాలిచ్చారంటే అర్థం చేసుకోవాలి. బాలయ్యబాబుతో రూలర్ లో నటించాక ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేకపోయింది.
అయినా ఇప్పటికీ టాలీవుడ్ పై ఎంతో ఆసక్తిగా ఉందిట ఈ భామ. పనిలో పనిగా తెలుగు ఓటీటీల్లో ఆఫర్ల కోసం వేచి చూస్తోందట. ది పవర్ అనే హిందీ చిత్రంలోనూ సోనాల్ నటిస్తోంది. ఇంతకుముందు జీ5 ఒరిజినల్ కోసం స్కైఫైర్ అనే ఓటీటీ చిత్రంలో నటించింది. ఇప్పుడు కూడా ఓటీటీలో ఆఫర్లు వస్తున్నా పెద్ద తెర కోసం వేచి చూస్తోందట.
మరోవైపు సోషల్ మీడియాల్లోనూ సోనాల్ ఎక్కడా తగ్గడం లేదు. ఇటీవల నిరంతర ఫోటోషూట్లతో అంతర్జాలంపై దండయాత్ర చేస్తోంది. యోగా జిమ్ సెషన్స్ తో పాటు మ్యాగజైన్ కవర్ షూట్లను కూడా సోనాల్ ఇన్ స్టా వేదికపై షేర్ చేస్తోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన కొన్ని యోగా భంగిమలు అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. సోనాల్ రకరకాల అసనాల్ని ప్రదర్శిస్తున్న తీరు అందుకోసం ఎంపిక చేసుకున్న వస్త్రధారణ ఆసక్తిని పెంచుతోంది. బ్లూ డ్రెస్.. వైట్ అండ్ వైట్ ట్రాక్.. పింక్ ట్రాక్ లో సోనాల్ వేడెక్కించే భంగిమలతో యోగాసనాలను ప్రాక్టీస్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.