Begin typing your search above and press return to search.

సోనాల్ లో ఇంత సింప్లిసిటీ ఇంకెప్పుడూ చూడ‌లేం

By:  Tupaki Desk   |   24 April 2021 8:00 PM IST
సోనాల్ లో ఇంత సింప్లిసిటీ ఇంకెప్పుడూ చూడ‌లేం
X
టాలీవుడ్ లో యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించిన సోనాల్ చౌహాన్ కి ప‌రిశ్ర‌మ అగ్ర హీరో బాల‌కృష్ణ అవ‌కాశం ఇచ్చినా ఎందుక‌నో ఆశించినంత పెద్ద కెరీర్ ద‌క్క‌లేదు. బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టించినా స‌క్సెస్ లేదు. అయితే క్రికెటర్ కెఎల్ రాహుల్ తో డేటింగ్ చేస్తోందన్న పుకార్ల‌తో యువ‌త‌రంలో పాపులారిటీ పెరిగింది.

ఆ త‌ర్వాత ఇన్ స్టా వేదిక‌గా ఫాలోయింగ్ పెంచుకునేందుకు సోనాల్ వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. ఇటీవ‌ల సోనాల్ చౌహ‌న్ లింగ‌రీ ఫోటోషూట్ అంతర్జాలంలో దుమారం రేపింది. తాజాగా మ‌రో హాట్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసిది. బ్లూడెనిమ్ నిక్క‌రు.. వైట్ టాప్ తో సోనాల్ ఒక్క‌సారిగా హీట్ పెంచింది. అన్ అడ‌ల్ట‌రేటెడ్ అనే క్యాప్ష‌న్ ని ఈ ఫోటోకి ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

జ‌న్న‌త్ లో ఇమ్రాన్ హష్మిని రొమాన్స్ చేసిన సోనాల్ చౌహాన్ గత దశాబ్దంలో హిందీ- తెలుగు- తమిళ భాషలలో న‌టించింది. చివరిసారిగా 2018 చిత్రం `పాల్తాన్` లో కనిపించింది. ప్ర‌స్తుతం మ‌హేష్ మంజ్రేక‌ర్ తెర‌కెక్కిస్తున్న థ్రిల్ల‌ర్ మూవీ `ది ప‌వ‌ర్` లో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఈ చిత్రంలో విద్యుత్ జ‌మ్వాల్ - శ్రుతిహాస‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.