Begin typing your search above and press return to search.
రైతులకు సోనాక్షి మద్ధతు .. కంగన ఏమంటుందో?
By: Tupaki Desk | 12 Feb 2021 9:47 AM ISTకేంద్రం వర్సెస్ రైతుల ఎపిసోడ్స్ గురించి తెలిసినదే. ఉత్తరాది అంతా ఇప్పుడు రైతు ఉద్యమాలతో నిండి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్- హరియానా- ఉత్తర ప్రదేశ్ వంటి ఉత్తర రాష్ట్రాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత మూడు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. కానీ బాలీవుడ్ తారలలో ఒక్కరు కూడా నిరసనలకు మద్దతు ఇవ్వలేదు. స్టార్ హీరోలంతా మోదీ ప్రభుత్వానికే మద్ధతు పలుకుతున్నారు. డిప్లమాటిక్ గా ఉండిపోయారు.
ఇదిలావుండగా ఇదే విషయంపై స్పందిస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం ప్రకంపనాలు సృష్టిస్తోంది. ``నజరేన్ మిలేక్,.. ఖుద్ సే పూచో - క్యున్? మాకు ఆహారం ఇచ్చే చేతులకు నివాళి… @ వరద్ భట్ నగర్ రాసిన అందమైన కవిత. @ Gursanjam.s.puri చిత్రీకరించారు. నేనే నేరేట్ చేశాను. #ఫార్మర్స్ ప్రొటెస్ట్`` అంటూ తెలిపింది సోనాక్షి.
షాట్ గన్ వారసురాలి మద్ధతుకు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతుల నిరసనలపై స్పందించడానికి చాలా మంది అగ్ర తారలు సంకోచించగా.. సోనాక్షి సిన్హా సాహసోపేతమైన చర్యకు అన్ని వర్గాల నుండి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇంతకుముందు అమెరికన్ పాప్ స్టార్ రిహాన్నా మన రైతులకు మద్ధతు పలకడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కంగన పూర్తి వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇప్పుడు సోనాక్షిపైనా క్వీన్ ఫికర్ ఎలా ఉంటుందోనన్న చర్చా మొదలైంది.