Begin typing your search above and press return to search.

సినిమాల్లేక ఈ రికార్డు స్టంట్లు చేస్తోందే

By:  Tupaki Desk   |   2 March 2016 9:00 PM IST
సినిమాల్లేక ఈ రికార్డు స్టంట్లు చేస్తోందే
X
సోనాక్షి సిన్హా. బాలీవుడ్‌ లో ''దబాంగ్‌'' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే ఆ మధ్యన వరుసగా పెద్ద పెద్ద మాస్‌ కమర్షియల్‌ హిట్లలో కనిపించిన సోనాక్షి సిన్హా.. ఇప్పుడేమో కనీసం ఆర్టు సినిమాల్లో కూడా మెరవట్లేదు. వెయిట్‌ తగ్గిన తరువాత కూడా సరైన ఆఫర్లు రాకపోవడమే అందుకు కారణం. అయితే మురుగుదాస్‌ డైరక్షన్‌ లో రూపొందుతున్న ''అకీరా'' సినిమా కూడా ఎందుకో అనుకున్నదానికంటే ఎక్కువ లేటవుతోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయినా కూడా.. రిలీజ్‌ గురించి కాని.. ఏదైనా ప్రమోషన్‌ రిలేటెడ్‌ కాని.. ఒక్క చిన్న మాట కూడా సదరు ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి వినిపించట్లేదు.

ఇకపోతే మొన్నామధ్యన ఒక మ్యూజిక్‌ వీడియోతో మెరిసిన సోనా.. ఇప్పుడు ఏకంగా గిన్నీస్‌ రికార్డు కోసం ప్రయత్నిస్తోంది. వరల్డ్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా.. మార్చ్‌ 8న పోలాండ్‌ కి చెందిన ప్రఖ్యాత కాస్మెటిక్‌ బ్రాండ్‌ ఇంగ్లోట్‌ ముంబయిలో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఒకే ప్లేసులో అత్యధికంగా అమ్మాయిలు పాల్గొని చేతి గోళ్ళకు రంగేసుకుంటారట. ఇందులో వేలాది మంది మహిళలతో పాటు సోనాక్షి కూడా పాల్గొననుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యమే గిన్నిస్‌ రికార్డు సాధించడం. 'మోస్ట్‌ పీపుల్‌ పెయింటింగ్‌ దెయిర్‌ ఫింగర్‌ నెయిల్స్‌ సైమల్‌ టేనియస్లీ’ అనే రికార్డును కొట్టేయాలని ఇది కంటెస్ట్‌ చేస్తున్నారట. మొత్తం ప్రోగ్రామ్‌కు సోనాయే బ్రాండ్‌ అంబాసిడర్‌. రికార్డు వస్తుందనే కాన్ఫిడెన్స్‌ అమ్మడి కళ్లలో కనిపిస్తోందిలే. కాని సినిమాల పరిస్థతి ఏంటి?