Begin typing your search above and press return to search.
ఛాన్స్ ఇవ్వమని ఏ ప్రొడ్యూసర్ అడిగిందే లేదన్న హీరోయిన్!
By: Tupaki Desk | 28 Feb 2020 1:30 AM GMTతన కెరీర్ లో ఎప్పుడూ ఏ ప్రొడ్యూసర్ దగ్గరకూ వెళ్లి అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకున్నదే లేదని అంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఒకింత గర్వంగానే ఈ విషయాలను చెప్పుకొచ్చింది సోనాక్షి. ఏ ప్రొడ్యూసర్ దగ్గరకూ వెళ్లి తను అవకాశాల కోసం అర్థించలేదని ధీమాగా చెబుతోంది ఈ హీరోయిన్. బాలీవుడ్ లో వివిధ సినిమాల్లో నటించడంతో పాటు, దక్షిణాదిన కూడా ఒకటీ అర సినిమాలు చేసిన సోనాక్షి ఇలా తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది.
సాధారణంగా హీరోయిన్ అవకాశాలు ఏ అమ్మాయికీ అంత తేలికగా రావు. తమ ఫోర్ట్పోలియోలు పట్టుకుని వాళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అనేక ఆడిషన్స్ కు హాజరయి ఉంటారు. అలా వెళ్లిన వాళ్లలో చాలా మంది తిరస్కరణకే గురి అవుతుంటారు కూడా. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వాళ్లు కూడా తొలి తొలిగా వివిధ ప్రొడక్షన్ హౌస్ ల వద్దకు వెళ్లి తిరస్కరణను పొందిన వాళ్లే ఉంటారు. ఆ జాబితాలో చాలా మంది ప్రముఖ హీరోయిన్లే ఉంటారు. అలాగే తొలి తొలి సినిమాల అవకాశాలు వచ్చినా... అవి ఏ ఫెయిల్యూరో అయితే ఆ తర్వాత హీరోయిన్లు మరింతగా కష్టపడాల్సి ఉంటుందనేది సహజంగా అర్థం చేసుకోదగినదే.
అయితే తను అలాంటి వాటన్నింటికీ మినహాయింపు అంటోంది సోనాక్షి. తన కెరీర్ లోనే ప్రాధేయపడిన సందర్భాలు కాదు కదా, కనీసం రిక్వెస్ట్ చేసిన సందర్భాలు కూడా లేవని అంటోంది. అవకాశాలన్నీ తను కోరకుండానే తన వెంట వచ్చాయని ఆమె చెబుతూ ఉంది.
అయినా ఈమె నేపథ్యం ఏమీ సామాన్యమైనది కాదు కదా! బాలీవుడ్ షాట్ గన్ గా పేర్గాంచిన శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి. ఇక కెరీర్ ఆరంభంలోనే ఈమె పై సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో చూపు పడింది. ఆ సినిమా కాస్తా సూపర్ హిట్ అయ్యింది. దీంతో.. ఈమె కు వేరేగా అవకాశాల కోసం అర్థించాల్సిన అవసరం సహజంగానే వచ్చి ఉండకపోవచ్చు. అందుకే తను లాబీయింగ్ చేయలేదని ధీమాగా చెబుతూ ఉంది!