Begin typing your search above and press return to search.

నటుడి కొడుకు గర్వపడేలా చేశాడు

By:  Tupaki Desk   |   9 April 2018 11:31 PM IST
నటుడి కొడుకు గర్వపడేలా చేశాడు
X
బాషభేదం లేకుండా అన్ని ఇండస్ట్రీలో లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటులు మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలను కొన్ని రాష్ట్రాల్లో గుర్తుపట్టకపోవచ్చు కానీ ఇండియాలో దాదాపు అన్ని ఇండస్ట్రీలో గుర్తుపట్టే నటుడు ఒకరున్నారు. అతనే మాధవన్. సినిమా అంటే తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ నటుడు తెలియకుండా ఉండడు. కథ డిమాండ్ చేస్తే చిన్న సినిమాల్లో అయినా పెద్దా సినిమాల్లో అయినా మాధవన్ తీసుకోకుండా ఉండలేరు.

ఎన్నో మంచి పాత్రలు చేసి ప్రశంసలు అందుకున్నా నటుడికి ఇప్పుడు తన కొడుకు నుంచి కూడా మంచి తండ్రి అనే లెవెల్లో ప్రశంసలు అందుతున్నాయి. మాధవన్ - సరితా కుమారుడు వేదాంత్ తన పేరెంట్స్ గర్వపడే విధంగా ఒక పోటీలో గెలిచాడు. థాయిలాండ్ లో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీలలో గెలిచి వేదాంత్ మొదటి సారి మెడల్ ని అందుకున్నాడు. మొదట ఎవరో అని అంతా అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో మాధవన్ కుమారుడే అని తెలియగానే నెటీజన్స్ ప్రశంసలను అందిఅటున్నారు.

మాధవన్ కూడా ఎంతో సంతోషించాడు. ఇకపోతే ప్రస్తుతం మాధవన్ రెస్ట్ లో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఒక గాయం కారణంగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాధవన్ చాలా రోజుల తరువాత సవ్యసాచి సినిమాతో విలన్ గా కనిపించబోతున్నాడు. నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తోన్న ఆ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.