Begin typing your search above and press return to search.

అల్లు శిరీష్ - మల్లూ బ్యూటీ మధ్య సంథింగ్ సంథింగ్..!

By:  Tupaki Desk   |   28 Dec 2021 3:31 PM GMT
అల్లు శిరీష్ - మల్లూ బ్యూటీ మధ్య సంథింగ్ సంథింగ్..!
X
సినీ ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వ సాధారణం. ఒక సినిమా కోసం ఏ ఇద్దరు హీరోహీరోయిన్లు కలిసి పనిచేసినా.. ఆఫ్ స్క్రీన్ లో కొంచెం క్లోజ్ గా ఉన్నా వారి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని పుకార్లు వస్తుంటాయి. ఇప్పుడు ఒక యువ టాలీవుడ్ హీరో తన కో స్టార్ తో ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

కథలోకి వెళితే, యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం గార్జియస్ మల్లూ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌ తో కలిసి ''ప్రేమ కాదంట'' అనే న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్ లోనూ స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకుంటున్నారు. దీంతో శిరీష్ - అనూ బేబీ మధ్య ఏదో వ్యవహారం జరుగుతోందని ఫిల్మ్ నగర్‌ లో టాక్ వినిపిస్తోంది.

అల్లు శిరీష్ - అనూ ఇద్దరూ తరచుగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా వీరి మధ్య ఏదో ఉందనే సందేహాలు బలపడటానికి కారణమయ్యాయి. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా అను ఇమ్మాన్యుయేల్‌ కి అల్లు శిరీష్ ఓ ప్రత్యేకమైన కేక్‌ ను పంపించారు. మెర్రీ క్రిస్మస్ "నా ఫేవరెట్ కో-స్టార్! మువా" అని వ్రాసుకొచ్చాడు. కేకు తనకు నచ్చినట్లు అనూ బేబీ సమాధానం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యుయేల్ మధ్య స్నేహపూర్వక సంబంధానికి మించి ఏదో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వీరు కలిసి నటిస్తున్న 'ప్రేమకాదంట' సినిమా కూడా లవ్ అండ్ లివింగ్ రిలేష‌న్ షిప్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది.

కాగా, ''ప్రేమకాదంట'' చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబు - ధీర‌జ్ మోగిలినేని సహ నిర్మాతలు‌గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ - అచ్చు రాజ‌మ‌ణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. త‌న్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆర్. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'ప్రేమకాదంట' ప్రీ లుక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. 'ఎబిసిడి' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని అల్లు శిరీష్ నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.