Begin typing your search above and press return to search.

సలార్ బ్యూటీ కథేంటి..??

By:  Tupaki Desk   |   19 April 2021 12:30 PM GMT
సలార్ బ్యూటీ కథేంటి..??
X
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ పూర్తిచేసి సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ ఓరియెంటెడ్ సినిమాగా సలార్ రూపొందుతుంది. కేజీఎఫ్ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఇంతవరకు చూడని లుక్కులో కనిపిస్తాడని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్ధమవుతుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. డార్లింగ్ సరసన శృతి ఫస్ట్ టైం జతకడుతోంది. అయితే ఈ సినిమాలో శృతి ఏ పాత్రలో నటిస్తోంది..? అనే ప్రశ్న ప్రస్తుతం సలార్ ఫ్యాన్స్ లో ఏర్పడింది.

అయితే నిజమో కాదో తెలియదు కానీ శృతి పాత్ర పై కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో శృతిహాసన్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. నిజంగానే ఈ సలార్ లో జర్నలిస్ట్ పాత్రే అయితే మరి ప్రభాస్ తో ఎలా పరిచయం అవుతుంది.. వీరిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉండబోతుందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సందేహాలకు సరైన సమాధానం దొరకాలంటే మాత్రం ఖచ్చితంగా మేకర్స్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సలార్ సినిమాను కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నాడు. ఈ ఏడాది శృతి క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. చూడాలి సలార్ లో శృతి ఎలాంటి మ్యాజిక్ చేయనుందో..!