Begin typing your search above and press return to search.

#ఆశ నిరాశ‌.. జూలై చివ‌రి నాటికి ప‌రిష్కారం!

By:  Tupaki Desk   |   22 May 2021 8:00 PM IST
#ఆశ నిరాశ‌.. జూలై చివ‌రి నాటికి ప‌రిష్కారం!
X
2020లో మ‌హ‌మ్మారీ అనూహ్యంగా ఇండియాలోకి అడుగుపెట్టింది. మొదటి వేవ్ వ‌చ్చి వెళ్లింది. 8నెల‌ల పాటు పూర్తి సంక్షోభంలో ప‌డిపోయిన సినీప‌రిశ్ర‌మ నెమ్మ‌దిగా కోలుకుంది. ఏడాది చివ‌రి నాటికి కుదుట‌ప‌డి 2021 ఆరంభం బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ఊపందుకుంది. థియేట‌ర్లు తెరిచాక జ‌నం సినిమాని ఆద‌రించారు. సినిమా షూటింగులు య‌థావిధిగా సాగాయి.

కానీ ఆర్నెళ్ల‌లోనే ఎంతో మార్పు. సెకండ్ వేవ్ క‌ల్లోలం రెండు నెల‌లుగా ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. మ‌ళ్లీ అంతా బంద్. క‌నీసం ఈ వ‌ర్షాకాలంలో ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని జూన్ ఎండ్ నాటికి పూర్తిగా త‌గ్గిపోతుంద‌ని ఎవ‌రికి వారు విశ్లేషిస్తున్నా.. దానిపై ఇంకా పూర్తిగా న‌మ్మ‌కం ఏర్ప‌డ‌డ‌డం లేదు. కార‌ణం ఏదైనా ప్ర‌స్తుతానికి లాక్ డౌన్ ల‌తో షూటింగుల్లేవ్. థియేట‌ర్లు ఓపెన్ చేయ‌లేదు. స్వ‌చ్ఛందంగానే ఎవ‌రికి వారు థియేట‌ర్ల‌ను మూసేసారు. ఇదంతా ప‌రిశ్ర‌మ‌ను దెబ్బ కొడుతోంది. ఈ నష్టం అంతా ఇంతా కాదు.

కానీ సాధార‌ణ ప‌రిస్థితులు ఎప్ప‌టికి సాధ్యం? అన్న‌దానికి స‌రైన ఆన్స‌ర్ లేదు. కొంద‌రి విశ్లేష‌ణ ప్ర‌కారం.. గ‌త ఏడాది ఫ‌స్ట్ వేవ్ వ‌ర్షాకాలంలో త‌గ్గిపోయింది. ఇప్పుడు కూడా వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి. ఇది క‌రోనా ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంది. ఈలోగానే ఈ నెల రోజుల్లో వ్యాక్సినేష‌న్ కూడా ఊపందుకుంటుంది. నెమ్మదిగా 60శాతం జ‌నానికి వ్యాక్సినేష‌న్ పూర్త‌యితే గ‌నుక ప‌రిస్థితి అదుపులోకి వస్తుంద‌న్న హోప్ ఉంది.

కార‌ణం ఏదైనా కానీ జూన్ ఎండ్ నాటికి కొంత‌వ‌ర‌కూ స‌న్నివేశం మారుతుంద‌ని జూలై మిడిల్ నాటికి చాలావ‌ర‌కూ క‌రోనా అదుపులోకి వ‌స్తుంద‌ని క‌నీసం షూటింగుల‌కు అడ్డంకులు తొల‌గిపోతాయ‌ని సినీప‌రిశ్ర‌మ భావిస్తోంది. 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెరుచుకునేందుకు జూలైలో ఆస్కారం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇది ద‌స‌రా సినిమాల‌కు ఊపు తెచ్చే వీలుంటుంది. అయితే అప్ప‌టికి కూడా వ్యాక్సినేష‌న్ ప్ర‌భావం చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ వ్యాక్సినేష‌న్ పూర్త‌యితేనే ప‌రిశ్ర‌మ‌లు కోలుకుంటాయ‌ని అంచ‌నా.

ప్రస్తుతం స్టార్లంతా త‌దుప‌రి షెడ్యూళ్ల‌పైనా దృష్టి సారించారు. ఆర్టిస్టుల కాల్షీట్ల‌ను రీషెడ్యూల్ చేసే ప్లాన్ లో ఉన్నారు. జూలై లో చాలా వ‌ర‌కూ ప‌రిష్కారం ఉంటుంద‌న్న హోప్ తోనే ఇదంతా చేస్తున్నార‌ని స‌మాచారం. టాలీవుడ్ లో 25 వ‌ర‌కూ క్రేజీ సినిమాల షూటింగులకు షెడ్యూలింగ్ చేసే ప‌నిలో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.