Begin typing your search above and press return to search.
సుప్రీం హీరో సాహసం థియేటర్లకు ఊపు తెస్తుందా?
By: Tupaki Desk | 19 Dec 2020 11:00 AM ISTథియేటర్లలో సినిమాలు రిలీజై ఏడెనిమిది నెలలు అయ్యింది. ఇటీవలే హాలీవుడ్ మూవీ టెనెట్ రిలీజైంది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ రిలీజైంది. అసలు జనం థియేటర్ల వైపు తొంగి చూస్తారా? అనుకునే పరిస్థితిలోనూ డేరింగ్ గా రిలీజ్ చేశారు వీటిని. ఏదో నామమాత్రపు రిలీజ్ లేనా ఇవి అనేంతగా జనం ఇంకా ఇండ్ల నుంచి బయటపడే పరిస్థితిలో కనిపించలేదని విశ్లేషించారు.
రిలీజైన సినిమాల గురించిన సందడే కనిపించలేదు. ఇకపోతే ఇప్పటికే వ్యాక్సిన్ వచ్చేసింది అంటూ హడావుడి జరుగుతోంది కాబట్టి జనం నెమ్మదిగా భయాల నుంచి బయటపడి థియేటర్లకు వస్తారనే ఆశాభావం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రిస్మస్ రిలీజ్ లతో జనం వస్తారా రారా అన్నదానిపై అంతో ఇంతో క్లారిటీ వచ్చే వీలుంది.
అయితే ఇలాంటప్పుడు సరిగ్గా క్రేజున్న సినిమా పడాలి. అప్పుడే జనం ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసి థియేటర్ల వైపు వచ్చే వీలుంది. ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత అంతో ఇంతో క్రేజుతో వస్తున్న ఏకైక సినిమాగా సాయి తేజ్ `సోలో బ్రతుకే సోబెటర్` గురించి చర్చ సాగుతోంది. ఇక థియేట్రికల్ రిలీజ్ అవుతుందా లేదా? అన్నది తెలిపేందుకు తాజాగా పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. అన్ని ప్రధాన నగరాల్లో థియేట్రికల్ రిలీజ్ యాడ్లు వచ్చాయి. దీంతో సాయి తేజ్ అభిమానుల్లో కదలిక వచ్చింది. మరి జనం అన్ని భయాందోళనల్ని విరమించి థియేటర్లకు వస్తారా రారా? అన్నది చూడాలి. వరుస విజయాలతో జోరుమీదున్న సాయి తేజ్ మరో హిట్ కొడతారా? 50శాతం ఆక్యుపెన్సీలోనూ ఫుల్ రన్ అందుకుంటాడా లేదా? అన్నది చూడాలి.
చిత్ర బృందం మాటకు కట్టుబడి వచ్చే శుక్రవారం తమ చిత్రాన్ని విడుదల చేయబోతోంది. ప్రకటనలతో దీనిపై స్పష్ఠత వచ్చేసింది. ఏపీ తెలంగాణలో ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉండనుందో వేచి చూడాలి. ఒకవేళ విజయవంతంగా ఆడితే గనుక సంక్రాంతికి సరికొత్త కళ వస్తుందన్న నమ్మకం పెరుగుతుంది.