Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: సుప్రీంహీరోకి OTT చేసిన మేలు

By:  Tupaki Desk   |   4 Dec 2020 10:05 AM IST
ట్రెండీ టాక్‌: సుప్రీంహీరోకి OTT చేసిన మేలు
X
OTT ల వ‌ల్ల లాభ‌మా న‌ష్టమా? అన్న ప్ర‌శ్న‌కు డి.సురేష్ బాబు లాంటి అగ్ర‌నిర్మాత బోలెడంత లాభం అనే చెబుతారు. ఒక ఎగ్జిబిట‌ర్ గా ఓటీటీ రిలీజ్ ల‌ను స‌మర్థించారాయ‌న‌. ఓటీటీ సంస్థలు బోలెడంత పెట్టుబ‌డులు పెడుతూ సినిమాల్ని ఎంక‌రేజ్ చేస్తున్నాయ‌ని అన్నారు. ఇక ఇదే ఓటీటీ సుప్రీంహీరో సాయి తేజ్ కి చాలా మేలు చేస్తోంది.

ప్ర‌ఖ్యాత జీ స్టూడియోస్ సాయి తేజ్ న‌టించ‌నున్న తాజా సినిమా `రిపబ్లిక్` ను రూ .35 కోట్లకు కొనుగోలు చేసిందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జీ స్టూడియో కే ఇంత‌కుముందు `సోలో బ్రతుకే సో బెటర్` మొత్తం హక్కులను కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే సంస్థ రిపబ్లిక్ రిలీజ్ కి సంబంధించిన స‌ర్వ హ‌క్కుల్ని అంటే థియేట్రిక‌ల్ నాన్ థియేట్రిక‌ల్ .. డ‌బ్బింగ్ రీమేక్ హ‌క్కుల్ని ఓవ‌రాల్ గా 35 కోట్ల‌కు ఛేజిక్కించుకుంటోందిట‌.

సాయితేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌స్థానం దేవ‌క‌ట్టా రూపొందిస్తున్న ఈ మూవీ ఇంకా నిర్మాణ ప్రారంభ దశలో ఉంది. దానిపై బిగ్ బెట్టింగ్ న‌డుస్తుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మే. సినిమా నిర్మాణం పూర్తయ్యే వరకు వారు నిధులను భాగాలుగా విడుదల చేస్తారు. మొదటి కాపీ సిద్ధమైన తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారని తెలుస్తోంది. సాయి తేజ్ త‌ర‌హాలోనే ఇత‌ర న‌వ‌త‌రం హీరోల‌కు ఓటీటీలు భారీ మొత్తాల్ని చెల్లించి రిలీజ్ హ‌క్కుల్ని కొనుగోలు చేస్తుండ‌డం ఆస‌క్తిక‌ర లాభ‌దాయ‌క‌ ప‌రిణామం. సినిమా ప్రారంభం నుంచే పెట్టుబ‌డులు పెడుతూ ఓటీటీ సంస్త‌లు నిర్మాణంలో భాగ‌స్వామ్యం అయితే అది నిర్మాత కు ఆర్థిక భారాన్ని చాలావ‌ర‌కూ త‌గ్గించిన‌ట్టే అవుతుందన్న విశ్లేష‌ణ వెలువ‌డుతోంది.