Begin typing your search above and press return to search.

సోలో బ్ర‌తుకే ఓటీటీ డీల్ తేజ్ రేంజు త‌గ్గించిందా?

By:  Tupaki Desk   |   7 Sept 2020 12:40 PM IST
సోలో బ్ర‌తుకే ఓటీటీ డీల్ తేజ్ రేంజు త‌గ్గించిందా?
X
ఇటీవ‌లి క‌ష్ట కాలంలో టాలీవుడ్ ని ఓటీటీలు ఆదుకుంటున్నాయ‌నే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల‌కే కాదు.. మీడియం రేంజ్ హీరోలకు భారీగానే చెల్లింపులు చేస్తూ ఓటీటీలు ఒప్పందాలు కుదుర్చుకోవ‌డం భ‌విష్య‌త్ పై ఆశావ‌హ ధృక్ప‌థాన్ని పెంచుతున్నాయి. థియేట్రిక‌ల్ రిలీజ్ తో వ‌చ్చేంత లాభాలు లేక‌పోయినా సేఫ్ గేమ్ ఆడేందుకు డిజిట‌ల్ వేదిక క‌లిసొస్తోంది.

ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్.. జీ5 వంటి సంస్థ‌లు ప‌లు బిగ్ డీల్స్ చేస్తున్నాయి. `వి` త‌ర్వాత ఓటీటీ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న మ‌రో క్రేజీ సినిమాగా `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` పాపుల‌ర‌వుతోంది. ఈ సినిమా కోసం దాదాపు 30 నుంచి 35 కోట్ల మధ్య చెల్లించేందుకు జీ 5 యాప్ ముందుకొచ్చింద‌ట‌. సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ డీల్ ఇప్ప‌టికే పూర్త‌యింద‌ని స‌మాచారం. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా జీ 5 యాప్ ద్వారా జ‌నాల‌కు అందుబాటులో ఉంటుందట‌.

అయితే జీ 5 యాప్ ఫ్రీ టు వాచ్ అంటే త‌ప్ప ఈ సినిమాను చూడ‌టం కోసం యాప్ ను మెగాభిమానులు డౌన్ లోడ్ చేసుకునే అవ‌కాశం లేదు. చాలా మంది మెగా ఫ్యాన్స్ కి జీ 5 అనే యాప్ ఉంద‌నే విష‌యం కూడా తెలీనే తెలియ‌దు. ఓటీటీ అంటే అమెజాన్ ప్రైమ్ అనుకుంటున్న ఈ సీజ‌న్ లో మ‌రి జీ5 యాప్ ద్వారా సినిమా రిలీజ్ చేయ‌డం రాంగ్ స్టెప్ ఏమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలానే శాటిలైట్ అండ్ డిజిటిల్ రైట్స్ రెండూ క‌లిపి జీ నెటవ‌ర్క్ అండ్ జీ 5 యాప్ కి 35 కోట్ల‌కి అమ్మేశార‌ట. సాయితేజ గ‌త సినిమా ప్ర‌తిరోజూపండుగే కేవ‌లం థియేట‌ర్స్ ద‌గ్గ‌ర నుంచే 45 కోట్లు షేర్ వ‌సూల్ చేసింది. ఇప్పుడు జీ5 కి అమ్మేసిన ఫిగర్స్ చూస్తుంటే సాయితేజ్ మార్కెట్ కంటే త‌క్కువకే డీల్ ఓకే అయ్యింద‌ని అనుకోవాలి.