Begin typing your search above and press return to search.

'సోలో బ్రతుకే..' ఫస్ట్ డే కలెక్షన్లతో నిర్మాతలు హ్యాపీయేనా..?

By:  Tupaki Desk   |   26 Dec 2020 11:15 AM IST
సోలో బ్రతుకే.. ఫస్ట్ డే కలెక్షన్లతో నిర్మాతలు హ్యాపీయేనా..?
X
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - నభా నటేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'సోలో బ్రతుకే సో బెటర్' థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్ఎన్‌ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ వారు నిన్న(డిసెంబర్ 25) విడుదల చేశారు. సుమారు పది నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాలను ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా పటాపంచలు చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఆట నుంచే డీసెంట్ కలెక్షన్లు రాబట్టాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే నూన్ షో ల వరకు కలెక్షన్స్ చూసుకుంటే సుమారు 91.37 లక్షల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మెగా హీరో సినిమా తొలిరోజు సుమారు 4.7 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కరోనా సమయంలో ఇలాంటి కలెక్షన్స్ అందుకోవడం మంచి విషయమే అని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం కలెక్షన్లపై తీవ్రంగా ప్రభావం చూపిందని.. లేకపోతే ఇంకా ఎక్కువ రాబట్టేదని తెలుస్తోంది. రాబోయే ఈ వారం రోజుల కలెక్షన్లను బట్టి సినిమా రిజల్ట్ ని అంచనా వేయొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా సూపర్ హిట్ అయిందని కేక్ కట్ చేసి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఏదేమైనా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫలితంతో ఇండస్ట్రీలో ఆశలు చిగురించి చిన్న, పెద్ద సినిమాలన్నింటికీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.