Begin typing your search above and press return to search.
'సోలో బ్రతుకే..' జనరల్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించలేకపోయిందా?
By: Tupaki Desk | 30 Dec 2020 8:00 PM ISTకోవిడ్ నేపథ్యంలో థియేటర్స్ లో సినిమాలు చూడటానికి జనాలు ఆసక్తిగానే ఉన్నారనే విషయం 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో కన్ఫర్మ్ అయిపోయింది. మెగా హీరో సాయి తేజ్ - నభా నటేష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని జీ గ్రూప్ వారు థియేట్రికల్ రిలీజ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాలను తొలగిస్తూ ‘సోలో బ్రతుకే..’ సినిమా ఫస్ట్ వీక్ మంచి వసూళ్లను రాబట్టింది. సుమారు పది నెలల తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఇండస్ట్రీ మొత్తం అండగా నిలబడింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వారందరూ రిలీజ్ రోజు మరియు సినిమా బాగుంటే వీకెండ్ వరకు మాత్రమే కలెక్షన్స్ ఇచ్చే మూవీ లవర్స్. జనరల్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కు వస్తే సెకండ్ వీక్ కలెక్షన్స్ కూడా వస్తాయి.
కానీ జనరల్ ఆడియెన్స్ ఇప్పటికీ కరోనా భయంతో థియేటర్స్ వైపు రావడానికి ఆలోచిస్తున్నారనే విషయం సోమవారం మంగళవారం 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకు వచ్చిన కలెక్షన్స్ రిపోర్ట్స్ సరైన ఆధారం అని చెప్పవచ్చు. ఈ రెండు రోజుల్లో సినిమాకి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి మరొక కారణం సాయి తేజ్ సినిమాని జనవరి మొదటి వారంలో జీ 5 యాప్ లో టెలికాస్ట్ చేయడానికి జీ గ్రూప్ వారు సన్నాహాలు చేస్తున్నారనే న్యూస్ బయటకు పొక్కడం అని తెలుస్తోంది. అందువల్లే జనరల్ ఆడియన్స్ 'సోలో..' చిత్రాన్ని థియేటర్స్ లో చూడటానికి రావడంలేదనే టాక్ నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాలో కంటెంట్ ఇంకాస్త బెటర్ గా ఉంటే వీకెండ్ తరువాత కూడా జనాలు థియేటర్స్ కి వచ్చి ఉండేవారనే కామెంట్స్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. జనవరి 1వ తేదీ వరకు మరో కొత్త సినిమా విడుదల లేనందున ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబడుతుందేమో చూడాలి.