Begin typing your search above and press return to search.
సోలో ‘పెర్ఫార్మెన్స్’ సో బెట్టర్.. బాక్సాఫీస్ గలగల
By: Tupaki Desk | 2 Jan 2021 11:00 AM ISTలాక్ డౌన్ తర్వాత తెరుచుకున్న థియేటర్లలోకి వెళ్లేందుకు స్టార్లు.. సూపర్ స్టార్లు.. భయపడుతున్నవేళ మొండి ధైర్యంతో ‘సోలో’గా ముందుకెళ్లాడు సాయిధరమ్ తేజ్. ఇటు కరోనా.. అటు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ నడుమ లోనికి వెళ్లినవాడు బయటకు వస్తాడా? అని యావత్ సినీ పరిశ్రమ కళ్లప్పగించి చూసింది. కానీ.. థియేటర్లో తనదైన మార్కు చూపడంతో అన్ని సమస్యలతోనూ పోరాడి విజయవంతంగా బయటపడ్డాడు సోలో బాయ్. తొలివారం ముగిసే లోగా బ్రేక్ ఈవెన్ కు వచ్చిన ఈ మూవీ.. జనవరి 1వ తేదీ నుంచి లాభాల బాటలో పయనిస్తోంది.
గత సంవత్సరం పరిస్థితి ఎలా ఉన్నా.. కొత్త సంవత్సరం మాత్రం తెలుగు సినిమాకు శుభారంభాన్ని ఇచ్చిందనే చెప్పాలి. విడుదలైన తొలి వారాంతానికి పెట్టుబడి వెనక్కి లాగేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ.. 1వ తేదీ నుంచి ప్రాఫిట్ లో రన్ అవుతోంది. రిలీజ్ నెక్స్ట్ డే తర్వాత కాస్త క్రౌడ్ తగ్గినట్టు అనిపించినప్పటికీ.. మళ్లీ పుంజుకుంది. అంతేకాాకుండా.. ఆ తర్వాత స్థిరంగా కొనసాగింది. ఈ ప్రదర్శనతో మొదటి వారంలోనే బ్రేక్-ఈవెన్ సాధించడానికి అవసరమైన వసూళ్లు సంపాదించింది. ఈ రెండో వారంలో సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతోంది. రాబోయే వీకెండ్ లో క్రౌడ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ వార్త తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో ఊరట కలిగించేదే. సోలో బ్రతుకే సో బెటర్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేసిన ఇతర సినిమాల మేకర్స్.. తమ మూవీస్ రిలీజ్ చేయడానికి ధైర్యంగా ముందుకొచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ హిట్ తో హీరో సాయి తేజ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. రెట్టించిన ఉత్సాహంతో నెక్స్ట్ మూవీకి సిద్ధమవుతున్నాడు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.