Begin typing your search above and press return to search.

మీరు చేసిన పని మర్చిపోయేదా.. సోహెల్‌ తో అభిజిత్‌

By:  Tupaki Desk   |   31 Dec 2020 12:00 PM IST
మీరు చేసిన పని మర్చిపోయేదా.. సోహెల్‌ తో అభిజిత్‌
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కంటెస్టెంట్స్ లో కొందరికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సారి విజేత అయిన అభిజిత్ తో పాటు మరి కొందరు బాగా పాపులర్ అయ్యారు. వారిలో సోహెల్‌ మరియు మెహబూబ్ లు కూడా ఉన్నారు. వీరిద్దరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హౌస్‌ లో ఉన్న సమయంలో వీరిద్దరి స్నేహంకు అందరు ఫిదా అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మెహబూబ్ తన స్నేహితుడు సోహెల్‌ కు సపోర్ట్‌ చేసిన తీరు అభినందనీయం. ఇక సోహెల్‌ టాప్‌ 3 లో నిలిచి ప్రైజ్‌ మనీ సగం తీసుకు రావడంకు మెహబూబ్‌ కారణం అంటూ వీడియో స్కాం బయటకు వచ్చింది.

ఆ విమర్శలు పట్టించుకోకుండా మెహబూబ్‌ మరియు సోహెల్‌ లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల మెహబూబ్‌ తన యూట్యూబ్‌ ఛానెల్ కోసం సోహెల్‌ ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ సమయంలో సోహెల్‌ తో అభిజిత్‌ కు ఫ్రాంక్‌ కాల్‌ చేయించాడు. సినిమా ఛాన్స్‌ అంటూ అభిజిత్‌ తో సోహెల్‌ మాట్లాడే ప్రయత్నం చేశాడు. మొదట నమ్మినా కూడా ఆ తర్వాత అభిజిత్‌ ఫ్రాంక్ అంటూ గుర్తు పట్టాడు. సోహెల్ ఆ తర్వాత మాట్లాడుతూ నన్ను మర్చి పోయావా అంటూ ప్రశ్నించాడు. నిన్ను ఎలా మర్చి పోతాను ఎక్కడ కు పోయినా కూడా నీవు చేసిన పని వల్ల గుర్తు చేస్తున్నారు అంటూ ఇండైరెక్ట్‌ గా వీడియో స్కాం గురించి అభిజిత్‌ మాట్లాడాడు. ఆ తర్వాత మీ ఇద్దరు ఇంత ఫేమస్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మా మద్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ అభిజిత్ క్లారిటీ ఇచ్చాడు.