Begin typing your search above and press return to search.
చిరుతో ఫొటో.. నాగ్ తో వీడియో.. సోహెల్ కథ మస్తుగుంది!
By: Tupaki Desk | 23 Jan 2021 8:30 AM GMTబిగ్ బాస్-4 సీజన్ విజేతతో సమానంగా క్రేజ్ దక్కించుకున్న కంటిస్టెంట్ సోహెల్. గ్రాండ్ ఫినాలెలో అమౌంట్ తీసుకొని టైటిల్ రేస్ నుంచి డ్రాప్ అయిన సోహెల్ సంచలనం సృష్టించాడు. సీజన్ ముగిసింది.. హడావిడి కూడా తగ్గింది. అయితే.. సరిగ్గా రెండు నెలల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు సోహెల్.
బిగ్ బాస్ టైటిల్ పోరులో ముగ్గురు కంటిస్టెంట్లు మిగిలారు. ఆ సమయంలో హోస్ట్ నాగార్జున 20 లక్షల ఆఫర్ ప్రకటించాడు. ఈ అమౌంట్ తీసుకొని టైటిల్ పోరు నుంచి వైదొలగొచ్చని చెప్పాడు. కానీ.. ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే.. కాసేపటి తర్వాత మరో ఐదు లక్షలు పెంచి మొత్తం రూ.25 లక్షలు చేశాడు నాగ్. దీంతో.. సోహెల్ ఆ ఛాన్స్ అందుకున్నాడు. చివరకు అభిజిత్ నాల్గో సీజన్ విజేతగా నిలవగా.. అఖిల్ రన్నర్‌గా మిగిలిపోయాడు.
అయితే.. సోహెల్ డబ్బులు తీసుకొని టైటిల్ రేస్ నుంచి వైదొలగడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత.. సోహెల్ సినిమా తీస్తానని చెప్పడం.. చిరంజీవి క్యారెక్టర్ అడగడం వంటి విషయాలన్నీ వైరల్ అయ్యాయి. కాగా.. ఇటీవల నాగార్జున, చిరంజీవిని కలిశాడు.
నాగార్జునను కలిసిన సోహెల్.. ఆ సందర్భానికి సంబంధించిన వీడియోలను షేర్ చేశాడు. నాగార్జునతో ఉన్న సమయం, చెప్పిన మాటలను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ‘మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్.. మీ సూచనలు ఎప్పుడూ ఫాలో అవుతా’నంటూ చెప్పుకొచ్చాడు సోహెల్.
ఇక, మెగాస్టార్ ఇంట్లో సోహెల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. చిరంజీవి రెండు గంటల విలువైన సమయాన్ని ఇచ్చారని చెప్పాడు. ఈ సందర్భంగా అంజనా దేవీ, సురేఖ ఆశీర్వాదం తీసుకున్నాడు సోహెల్. మెగాస్టార్ ఎన్నో గొప్ప గొప్ప సూచనలు ఇచ్చారన్న సోహెల్.. ‘జీవితానికి సరిపోయే మంచి మాటలు చెప్పారు’ అని ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.