Begin typing your search above and press return to search.

బిబి సోహెల్‌ అప్పుడే సినిమా కన్ఫర్మ్‌ చేశాడట

By:  Tupaki Desk   |   24 Dec 2020 9:31 AM IST
బిబి సోహెల్‌ అప్పుడే సినిమా కన్ఫర్మ్‌ చేశాడట
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విన్నర్‌ కాని విన్నర్‌ గా సోహెల్‌ నిలిచాడు. విజేతకు దక్కినంత ప్రైజ్ మనీ సోహెల్‌ కు దక్కడంతో పాటు చిరు నుండి ప్రశంసలు ట్రోఫీగా దక్కాయి అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తాను సినిమా చేస్తాను మీరు సపోర్ట్‌ చేయండి అంటూ అందరి ముందు కోరిన సోహెల్‌ కు చిరంజీవి అదిరిపోయే ఆఫర్‌ ను ఇచ్చాడు. నీవు చేయబోతున్న సినిమా ఫంక్షన్‌ కు రావడమే కాదు అందులో చిన్న పాత్రను కూడా చేసేందుకు నేను రెడీ అంటూ చిరంజీవి ప్రకటించాడు. దానికి తోడు సోహెల్ కు పెరిగిన క్రేజ్‌ తో సినిమా ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. అతడు బయటకు వెళ్లడమే ఆలస్యం పలువురు ఆయనతో సినిమాను చేసేందుకు సిద్దంగా ఉన్నామంటు ముందుకు వచ్చారట.

ఇటీవలే జార్జిరెడ్డి సినిమాను నిర్మించిన వారు సోహెల్‌ తో సినిమాకు సిద్దం అవుతున్నారట. ఇప్పటికే కథను సోహెల్‌ కు వినిపించడం కూడా అయ్యిందని అంటున్నారు. వచ్చే వారం రెండు వారాల్లో సోహెల్‌ సినిమా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సోహెల్‌ మాంచి వేడి మీద ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే చలి కాచుకోవడం మంచిదనే అభిప్రాయంతో చాలా మంది మేకర్స్‌ ఆయన్ను వెంటాడుతున్నారు. మరెంత మందికి సోహెల్‌ ఓకే చెప్తాడో చూడాలి. వచ్చే ఏడాదిలో సోహెల్‌ రెండు సినిమాలు ఖచ్చితంగా విడుదల చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌ ల్లో నటించేందుకు కూడా సోహెల్‌ కు ఆఫర్లు వస్తున్నాయట. ఈ సమయంలో కాస్త ఆచితూసి వ్యవహరిస్తే తప్పకుండా సోహెల్ మంచి స్టార్‌ అవుతాడేమో అంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.