Begin typing your search above and press return to search.
బిబి4 స్కాం వీడియోపై ఆ ముగ్గురు స్పందించారు
By: Tupaki Desk | 23 Dec 2020 8:43 AM ISTతెలుగు బిగ్ బాస్ లో గతంలో ఎప్పుడు జరగనిది ఈసారి జరిగింది. టాప్ 3 లో ఉన్న వారికి 25 లక్షల ఆఫర్ ఇచ్చి బయటకు వచ్చేస్తారా అంటూ నాగార్జున అడిగిన సమయంలో సోహెల్ తెలివిగా ఆలోచించి కుటుంబ సభ్యుల నిర్ణయం చెప్పమని ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చేశాడు. ఆ డబ్బు సోహెల్ కు చాలా అవసరం కనుక ఓకే అన్నట్లుగా అఖిల్ మరియు అభిజిత్ లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కట్ చేస్తే తన స్థానం ముందే తెలియడం వల్లే సోహెల్ ఆ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. రీ యూనియన్ సమయంలో మెహబూబ్ వచ్చి మూడు ను చూపించాడని అందుకే సోహెల్ కు క్లారిటీ వచ్చేసిందనే వాదన వినిపిస్తుంది. ఆ వీడియోను స్కాం వీడియో అంటూ సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. సోహెల్ మరియు మెహబూబ్ లు చీటింగ్ చేశారంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.
స్కాం చేసి గెలిచారంటూ వారిద్దరిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిపై అభిజిత్ స్పందించాడు. టీవీ9 ఇంటర్వ్యూలో అభిజిత్ ఆ వీడియో మొదటి సారి చూశాడు. ఆ వీడియో చూసి కొద్ది సమయం షాక్ అయిన అభిజిత్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తర్వాత హుందాగా స్పందించాడు. సరే ఆ విషయం వారి వ్యక్తిగతం. వారు ఏమైనా చేశారా లేదా అనేది స్టార్ మా ఎండోమోల్ షైన్ వారు చూసుకుంటారు. నాకు ట్రోఫీ గెలిచాను.. ఇంత మంది నన్ను అభిమానిస్తున్నారా అనే ఆనందం మాత్రం ఉంది. డబ్బుల విషయం మ్యాటర్ కాదు వారికి అవసరం కనుక తీసుకున్న పర్వాలేదు అన్నట్లుగా చాలా హుందాగా అభిజిత్ మాట్లాడాడు.
ఇక వీడియో స్కాం గురించి సోహెల్ మరియు మెహబూబ్ లు కూడా స్పందించారు. ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన సమయంలో సోహెల్ ను చాలా మంది ఆ ప్రశ్న అడిగారు. మెహబూబ్ అలా చెప్పడం వల్లే మీరు డబ్బు తీసుకుని బయటకు వచ్చేశారా అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో వాడు ఏదో చెబుతున్నట్లుగా అనిపించింది కాని ఏం చెప్పాడు అనేది క్లారిటీ లేదు. నా తమ్ముడు కూడా తీసుకుని వచ్చేయ్.. అందులో పది లక్షలు ఆశ్రమానికి ఇచ్చేద్దాం అన్నప్పుడు వెంటనే నేను అర్థం చేసుకుని వచ్చేశాను అంటూ సోహెల్ అన్నాడు. ఇక మెహబూబ్ స్పందిస్తూ నేను సోహెల్ ఇన్ స్టా ఫాలోవర్స్ గురించి చెప్పాను అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.
మెహబూబ్ మాత్రం క్లీయర్ గా నువ్వు టాప్ 3 లో ఉండబోతున్నావనో లేదా నువ్వు నెం.3 గా ఉన్నావనో సోహెల్ కు చెప్పేందుకు ప్రయత్నించాడు. అది సోహెల్ కు ఎంత వరకు రీచ్ అయ్యి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనేది ఆయనకే తెలియాలి. ఏది ఏమైనా సోహెల్ కూడా అందుకు అర్హుడే అంటూ కొందరు అభిజిత్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు. కనుక పెద్ద వివాదం లేకుండానే ఇది ముగిసే అవకాశం ఉంది. స్టార్ మా కాని షో నిర్వాహకులు కూడా దీని గురించి ఎక్కువగా చర్చించే అవకాశం లేదంటున్నారు.